ఎన్నారై కుటుంబం మర్డర్స్ - కారణమిదేనా

August 05, 2020

అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంటిలో నలుగులు భాతీయులు మృతి చెందారు. వీరిని సుంకర చంద్రశేఖర్, అతడి భార్య లావణ్య... వారి ఇద్దరి పిల్లలుగా గుర్తించారు. ఈ నలుగురి శరీరాలపై బుల్లెట్ గాయాలుండటంతో నిజంగానే కలకలం రేగింది. ఎవరైనా వీరిని కాల్చి చంపారా? లేదంటే వీరే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. అయితే ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు చంద్రశేఖరే... తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్ తో కాల్చి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గత కొంతకాలంగా చంద్రశేఖర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఒకే ఇంటిలో ఇలా భార్యాభర్తలు, వారి ఇద్దరి పిల్లలు తుపాకీ తూటాలకు నిర్జీవంగా పడి ఉన్న వైనం కలకలం రేపుతోంది. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డెన్ మోయిన్స్ లో జరిగిన ఈ ఘటనలో చనిపోయిన వారు తెలుగు నేల అది కూడా ఏపీకి చెందిన వారే తెలిసినప్పటికీ... వారు ఏపీలోని ఏ ప్రాంతానికి చెందిన వారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.