పండుగాయల దుమ్ము దులిపేసిన ఎన్నారైలు

June 06, 2020

వైసీపీ పబ్లిసిటీ దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అంతేకాదు... శవాల మోత తప్ప కారు కూడా  కనపడని న్యూయార్క్ నడిబొడ్డున లక్షల రూపాయల ప్రజాధనంతో ఎన్నారైలు మీరు క్షేమంగా ఉండండని ప్రకటన ఇచ్చిన ఈయన తెలివితేటలు ఎన్నారైలలో అభాసుపాలయ్యాయి. అమెరికా అధ్యక్షులే కాదు, ప్రపంచంలో కొందరు టాప్ లీడర్స్​, టాప్ బిజినెస్ మ్యాన్స్ శభాష్ చంద్రబాబు అన్న మనిషిని తన సొంత 23 ఎమ్మెల్యేలే నువ్వు వేస్టు జగన్ బెస్టు అంటున్నారని చెబుతున్నారు పండుగాయల. అబద్ధాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో ప్రపంచంలో నోబెల్ పొందగలిగినంత టాలెంట్ ఉన్నోళ్లు వైసీపీ నేతలు. అబద్ధాలతో జనాల్ని నమ్మించడం, తప్పును కూడా సమర్థించుకోవడం, ప్రజల పేరు చెప్పి స్కీములతో స్కాములు చేయడం... జనం డబ్బుతో జీతాలిచ్చి వలంటీర్లతో పార్టీ ప్రచారం చేయించుకోవడం అసలు లిస్టంటూ తయారుచేస్తే ... అబ్బా అఫిషియల్ రాజకీయం ఎలా చేయాలో జగన్ బ్యాచ్ ని చూసే నేర్చుకోవాలి. పండుగాయల ఎన్నారైల పరువు తీస్తున్నారంటూ పలువురు ఎన్నారైలు పండుగాయల రత్నాకర్ ను తీవ్రంగా ఎండ గట్టారు. కిందనున్న గూగుల్ డ్రైవ్ లింకులో ఎన్నారైల రెస్పాన్స్ వీడియో రూపంలో చూడొచ్చు. 

https://drive.google.com/drive/folders/1-KA4Jzr1V8hHxBD-HRUWJoFnBWzYt6Y2

https://www.youtube.com/watch?v=U87efNqypwc&feature=youtu.be