ఎన్. శివప్రసాద్, కోడెలకు ఎన్నారైల నివాళి

November 19, 2019

ప్రవాస న్యూజెర్సీ తెలుగు దేశం పార్టీ అభిమానులు, నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాద్, మాజీ ఎంపీ సీనియర్ తెలుగుదేశం నాయకుడు నారమల్లి శివప్రసాద్ లకు ఘన నివాళి అర్పించారు. నాట్స్ మాజీ అధ్యక్షులు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ  నాయకత్వం లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో తెలుగుదేశం అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారితో  తనకున్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ‘అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే  కోడెల  ప్రతిభని గుర్తించి రాజకీయాల్లోకి కి ఆహ్వానించారు, నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కోడెల గారికి పలు కీలక బాధ్యతలు అప్పగించారు అని తెలిపారు. కోడెల శివ ప్రసాద్ గారు అనేక కీలక శాఖలకు మంత్రిగా చేసి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు.

ఈ సందర్భంగా పలువురు న్యూజెర్సీ ఎన్నారై తెలుగు దేశం నాయకులు ప్రసంగించారు. ఎల్లప్పుడూ  అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా కోడెల జన హృదయాల్లో నిలిచిపోయారుని కొనియాడారు. కోటప్పకొండ అభివృద్ధికి, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ అభివృద్ధికి కోడెల శివ ప్రసాద్ గారు ఎంతో పాటుపడ్డారు అని కీర్తించారు. అలాగే శ్రీ ఎన్.శివ ప్రసాద్ గారు రాష్ట్ర విభజనను నిరసిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్  లో తన గళాన్ని వినిపించారు అని కొనియాడారు. శివ ప్రసాద్ గారు మంత్రిగా, పార్లమెంట్  సభ్యునిగా ఎన్నో సేవలందించారని కొనియాడారు. పుట్టుక నుంచి, చావు వరకు ఒకే పార్టీల మనగలిగిన ఇద్దరు నిబద్దత, నిజాయితీ కలిగిన ఇద్దరు మంచి నాయకులని తెలుగు దేశం పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోల్పోయారు అని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.

కార్యక్రమం లో పలువురు న్యూ జెర్సీ తెలుగుదేశం పార్టీ  కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీహరి మందాడి, రాజా కసుకుర్తి, రాధా కృష్ణ నల్లమల, వంశీ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్ వెనిగళ్ల, విష్ణు కనపర్తి, శ్రీ చౌదరి, నంద కల్లూరి, శ్రీనివాస్ ఓరుగంటి, సురేష్ బొల్లు, సూర్య గుత్తికొండ, రాజేష్ బేతపూడి ఇంకా అనేక మంది న్యూజెర్సీ  తెలుగుదేశం అభిమానులు పలువురు పాల్గొని ఇద్దరు నాయకులకి ఘనం గా నివాళులు అర్పించారు.