టాటా బే ఏరియాలో అట్ట‌హాసంగా హోలీ సంబురాలు

August 06, 2020

బే ఏరియా కాలిఫోర్నియాలో బే ఏరియా టాటా యువ హోలీ- 2019 సంబురాలు అట్ట‌హాసంగా జ‌రిగాయి. తెలంగాణ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ అమెరికాలోని 45 రాష్ట్రాల్లో విస్త‌రించి ఉన్న జాతీయ సంఘం. గ‌త మూడు ఏళ్లుగా టాటా లోక‌ల్ బాడీ బే ఏరియా చాప్ట‌ర్ టాటా యువ టీం ఈ ప్ర‌త్యేక‌మైన హోలీ కార్య‌క్రమం జ‌ర‌గ‌నుంది. కాలిఫోర్నియా ఫ్రీమాంట్‌లోని ఎలిజ‌బెత్ పార్క్‌లో ఈ ఏడాది 2500 మందికి పైగా హోలీకి హాజ‌ర‌య్యారు. హాజ‌రైన వారిలో భార‌త సంత‌తికి చెందిన అమెరికా పౌర‌స‌త్వం క‌లిగిన వారు, ఎన్నారైలు, విద్యార్థులు, సంద‌ర్శ‌కులు మ‌రియు వివిధ ప్రాంతాల‌కు చెందిన వారు ఈ హోలీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చేశారు.

స్థానికంగా ఉన్న ఏరోడ్యాన్స్ వారితో ఆక‌ట్ట‌కునే నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌నలు, క్రియా డ్యాన్స్ అకాడ‌మీ మ‌రియు డీజే అర్జ‌వ్ గోస్వామి బృందం ఆక‌ట్టుకునే మ్యూజిక్‌తో హాజ‌రైన వారంతా ఈ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేశారు. లైవ్ దోల్ ఈ కార్య‌క్ర‌మానికి మరింత ఉత్సాహాన్ని చేకూర్చింది. ఇండియ‌న్ ఐడ‌ల్ ఫేం మ‌రియు సింగ‌ర్ నిత్య‌శ్రీ త‌న ఆక‌ట్ట‌కునే గాత్రంతో ఈ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెచ్చారు. స్థానిక యాంక‌ర్ స‌ర‌స్వతి (స‌రు) మ‌రియు స‌త్య (టాటా యూత్ ఎఫైర్స్ చెయిర్‌)ఈ కార్య‌క్ర‌మం భార‌త‌దేశంలో ఎంత ఆక‌ర్ష‌ణీయంగా జ‌రుపుకొంటారో అదే రీతిలో ఉత్సాహ‌భ‌రితంగా మ‌లిచారు. తెలంగాణ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ యువ విభాగం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారికి ఉచితంగా రంగులు మురియు ఆహార స్నాక్స్ అందిస్తూ హాజ‌రైన వారిలో ఉత్తేజం నింపారు. హోలీ పండుగ యొక్క ఉత్సాహాన్ని రాబోయే త‌రానికి అందించేందుకు టాటా యువ విభాగం చేసిన ఈ కృషి సంద‌ర్భంగా హాజ‌రైన చిన్నారులు ఎంతో ఉత్సాహంగా గ‌డిపాడ‌రు. వ‌చ్చే ఏడాది మ‌రోమారు ఇదే త‌ర‌హాలో ధ‌మాకా హోలీ కార్య‌క్ర‌మంతో టాటా యువ హోలీ ఈవెంట్ నిర్వ‌హిస్తామ‌ని హామీ ఇచ్చారు.
టాటా బే ఏరియా టీం స‌తీశ్ బానావ‌త్ ( టాటా యూత్ ఎఫైర్స్ చెయిర్‌), శ‌శాంక్ గౌడ్ (టాటా యువ చైయిర్‌), టాటా ఆర్‌వీపీలు అమిత్ రెడ్డి (రీజిన‌ల్ వైస్‌ప్రెసిడెంట్‌), వెంక‌టేశ్ బుక్క (రీజిన‌ల్ వైస్ ప్రెసిడెంట్‌) మ‌రియు ఆర్‌సీ కోఆర్డినేట‌ర‌ర్లు ప్ర‌సాద్‌, మ‌హేష్‌, శిరీష కాలేరు, స‌ర‌స్వ‌తి వ‌ర‌కూర్‌, ర‌వి నేతి, గోపాల్‌, కార్తిక్‌, రాహుల్‌, నిదేశ్‌, ఈశ్వ‌రి చిత్త‌శుద్ధితో కూడిన కార్యాచ‌ర‌ణ‌ లేక‌పోతే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కాక‌పోయి ఉండేది కాదు. టాటా వాలంటీర్లు శృజ‌న్ రెడ్డి, బాల్ రెడ్డి, అనీశ్ రెడ్డి, ప్రీతం రెడ్డి, అభిలాష్‌, విన‌య్ గౌడ్‌, వెంక‌ట్‌, స‌తీశ్ కుమార్‌, స్పాన‌ర్లు సాక్రాస్ట‌క్ఇన్ఫో, ఆల్ఫా ఇన్ఫోసిస్‌, రోజ్ ఐటీ కార్ప్‌, జే క్రియేటివ్ వ‌ర్క్స్‌, నిత్య సాప్ట్‌వేర్‌, జాబ్స్ ఎన్ ప్రొఫైల్స్‌, బాబే టు గోవా రెస్టారెంట్, బొలింగ‌ర్ క‌న్య‌న్ డెంట‌ల్ డాక్ట‌ర్ రిజ్వీ, శాంటా క్లారా కౌంటీ, విండ్ మెరే రియాలిటీ కౌంటీ వ్య‌వ‌హ‌రించారు.

టాటా ఎగ్జిక్యూటివ్ క‌మిటీ కో ఆర్డినేట‌ర్‌& బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస మ‌న‌ప్ర‌గ‌డ ఈ సంద‌ర్భంగా స్పాన్స‌ర్లు, మీడియా మ‌రియు హాజ‌రైన వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. టాటా అడ్వైజ‌రీ కౌన్సిల్ స‌భ్యులు, ఏసీ చెయిర్ శ్రీ పైళ్ల మ‌ల్లారెడ్డి, ప్రెసిడెంట్ విక్ర‌మ్ రెడ్డి జంగం టాటా ఎగ్జిక్యూటివ్ క‌మిటీ త‌ర‌ఫున హోలీ శుభాకాంక్ష‌లు తెలియ‌జెప్పారు.