వైద్యులకు పోలీసులకు అండగా ఎన్నారై శశికాంత్

August 07, 2020

కరోనా విలయంతో మనుషుల్లో దాతృత్వం చూస్తుంటే... మానవత్వం ఇంకా ఈ సమాజంలో చాలా ఉంది అన్న భావన కలుగుతోంది. ఎక్కడ చూసినా ఎవరికి చేతనైనంత సాయం చేస్తూ హాయిగా పలువురిని ఆదుకుంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పోలీసులు అయితే తమ ప్రాణాలను రిస్కులో పెట్టి సమాజం కోసం కష్టపడుతున్నారు. వారి సేవకు జీతాలు సరిపోవు... మనం రుణపడి ఉంటాం ఎప్పటికీ. మనకు అంత సేవ చేస్తున్న ఈ వర్గాలకు కొంతలో కొంతయినా అడగా నిలబడాలని భావించారు ప్రముఖ ఎన్నారై మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ శశికాంత్

అంతే తన మిత్రుల సాయంతో ఏపీ తెలంగాణలో వైద్యుల స్వీయ రక్షణకు ఉపయోగపడేలా 50 వేల మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 30 వేల మాస్కులు, గ్లౌజులు పంచిపెట్టారు. ఏపీలో 20 వేలు పంచగా... తెలంగాణలో 10 వేలు పంచారు.  ఇంకో 20 వేలు పంచాల్సి ఉంది. మరోవైపు ఈరోజు వనస్థలి పురం ప్రాంతంలో జీహెచ్ఎంసీ బృందాలకు అవసమైన ఆహారాన్ని కూడా అందించారు. శశికాంత్ సాయానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలమా?