అమెరికాలో అసువులు బాసిన మరో లేడీ ఎన్నారై

July 15, 2020

మరో తెలుగు ఎన్నారై అసువులు బాసింది. అమెరికా గడ్డ మీద మరణించిన ఆమె పేరు సెగ్యం సంధ్య అని తెలుస్తోంది. అయితే... సంధ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమె అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరంలో భర్తతో కలిసి నివసిస్తోంది. సంధ్యది తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామం అని సమాచారం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కుటుంబ కలహాలు ఆమె ఆత్మహత్యకు కారణం అంటున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి మహేందర్ తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి మహేందర్, తల్లి విమలమ్మ కర్కా గ్రామంలో నివసిస్తున్నారు.