అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం

August 12, 2020

సరదా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విహార యాత్ర విషాద యాత్ర అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై అమెరికాలో ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన నూనె సురేష్ గా గుర్తించారు. కుటుంబం సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి విహార యాత్రకు వెళ్లిన సురేష్ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడిపోయి దుర్మరణం చెందినట్టు తెలిసింది. సురేష్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అనోన్యంగా ఉండే ఈ కుటుంబంలో ఓ పర్యటన తీవ్రమైన దు:ఖం మిగిల్చింది. అమెరికాలోని డాలస్ లో స్థిరపడిన సురేష్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

సురేష్ ను కోల్పోయిన అతని కుటుంబం తీవ్రమైన దు:ఖంలో ఉంది. అతడి మీతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. మృతేహం తరలింపునకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం అవుతాయి. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుటుంబం కావడంతో అంత భరించే స్థోమత వారికి లేదు. దీంతో బాధిత కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సహాయం కోసం ఆర్థిస్తోంది. తమ బిడ్డ కడ చూపు చూసుకునే అవకాశం కల్పించాలని పాలకులను అర్థిస్తున్నాయి.