ఒక పోస్టరు రాసి పెట్టాడు... అతనికి డబ్బులే డబ్బులు

August 13, 2020

అమెరికాలో ఓ వ్యక్తి ఇపుడు వైరల్ అవుతున్నాడు.  ట్రంప్ నేతృత్వంలో అమెరికా అనిశ్చితంగా తయారయ్యింది. దీనికి తోడు క.రోనా, రేసిజం బాగా పెరిగాయి. ఆర్థిక రంగం పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగాలుపోయాయి. ఇబ్బంది పడని కుటుంబమే లేదు. 

ప్రస్తుతం కోవిడ్ తరుణంలో దేశ వ్యాప్తంగా జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో క.రోనా విజృంభించింది. అసలే భారీ కేసులున్న అమెరికా... ఈ దెబ్బతో అవి రెట్టింపయ్యేలా వ్యవహరించింది. చివరకు ఒక పోలీసు అధికారి ట్రంప్ నువ్వు మేనేజ్ చేయలేనపుడు కనీసం నోర్మూసుకుని ఉండు అని ఒక పోలీసు అధికారి ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఒక నిరుద్యోగి విచిత్రమైన పనిచేశాడు. నాకు డబ్బులు దానం చేయండి లేదా ట్రంప్ కి ఓటు వేస్తా అని పోస్టరు రాసి పెట్టుకున్నాడు. అంతే అందరూ అతనికి దానం చేస్తున్నారట. దీనిని అందరూ షేర్ చేస్తున్నారు. అతను కోటీశ్వరుడు కావడం గ్యారంటీ అంటున్నారు.