యుఎస్ ఎన్నారైల నేతృత్వంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

August 03, 2020

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా నందిగామలో ఘనంగా నిర్వహిచారు. సోమవారం చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ముగ్గురు యుఎస్  ఎన్నారైలు తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటూ వేడుకలు జరిపారు. బవికాటి రంగప్ప&లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జయరాం నాయుడు,  గుడివాడ కి చెందిన ప్రముఖ ఎన్నారై శ్రీ శశికాంత్ వల్లేపల్లి, హెల్పర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శేషు బాబు కానూరు ల ఆధ్వర్యంలో​ ​చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్య తంగిరాల ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో నిబంధనలు అనుకరిస్తూ .. భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 వార్డుల్లో సోడియం హైపోక్లోరోడ్ తో శానిటైజేషన్ చేశారు. అంతే కాక 1500 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు. 

పోలీసులు, వైద్య సిబ్బంది, మీడియా వారికి బాడీ సూట్లు, గ్లవ్స్, ఫేస్ మాస్కులు, ఇతర రక్షణ పరికరాల్ని అందజేశారు. టీడీపీ నాయకులు విద్యాసాగర్​,​​ శ్రీమతి సత్యవతి, శ్రీమతి స్వర్ణలత,​ ​వెంకట రావు మరియు సూర్య నారాయణ  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటూ.. ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసి చంద్రబాబు జన్మదిన వేడుకల్ని నిర్వహించిన ఎన్నారైలు  డాక్టర్ జయరాం నాయుడు,  శశికాంత్ వల్లేపల్లి, శేషు బాబు కానూరులను మాజీ ఎమ్మెల్యే​  ప్రశంసించారు. దేశం మెచ్చిన నాయకుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇలా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.​ చంద్రబాబు నాయకత్వంలో పొందిన స్ఫూర్తి వల్లే మేము ఈ సేవా బాటలో నడుస్తున్నామని ఎన్నారైలు వెల్లడించారు.​