జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్ షర్మిల

December 13, 2019

ఎన్టీఆర్ బాగా మాట్లాడతారు. లోకేష్ అంతగా మాట్లడలేరు. ఇది వైసీపీ అనుచరగణం ఆరోపణ. అది టీడీపీ అంతర్గత సమస్య. ఎన్టీఆర్ సమస్య. లేదు అది పబ్లిక్ సమస్య అంటే మాత్రం... ఇంకో విషయం చర్చించాల్సి వస్తుంది.

భారతి కంటే షర్మిల యాక్టివ్ గా ఉంటారు. భారతి కంటే షర్మిల ఎక్కువ కష్టపడతారు. భారతి కంటే షర్మిల చాలా చాకచక్యంగా మాట్లాడతారు. మరి అలాంటపుడు షర్మిలకు ఎందుకు ఎంపీ పదవి, మంత్రి పదవి జగన్ ఇవ్వడం లేదు. వైసీపీ కి షర్మిలను ఎందుకు అధ్యక్షురాలిని చేయలేదు. కనీసం ప్రధాన కార్యదర్శిని చేయలేదు. పార్టీల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ. టీడీపీ పదవులు ఎవరికియ్యాలా అన్నది టీడీపీ సమస్య గానీ వైసీపీ సమస్య కాదు కదా??