ఎన్టీఆర్ బయోపిక్... మాకు గుణపాఠం నేర్పింది

February 24, 2020

ఎన్టీఆర్ బయోపిక్ ఒక భాగంగా తెరకెక్కిస్తామని చెప్పి... రెండు భాగాలుగా తీసినపుడే దాని మీద కొన్ని అనుమానాలు వచ్చాయి. మొదట్నుంచి దానిని వివాదాలు చుట్టుముట్టాయి. ఆ వివాదాల నుంచే లక్ష్మీస్ ఎన్టీఆర్ పుట్టుకువచ్చింది అని కూడా ఒక గాసిప్ ఉంది. ఏది ఏమైనా... అనేక ఆటంకాలు దాటుకుని రెండు భాగాలుగా ఆ సినిమా విడుదల అయ్యింది. బాక్సాఫీసులో నిలబడలేకపోయింది. తాజాగా ఆ సినిమా గురించి నిర్మాత రియాక్ట్ అయ్యారు.

ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం రావడం అదృష్టం. కానీ ప్రేక్షకులు ఆశించిన ఒక కీ పాయింట్ మేము మిస్సయ్యాం. అందువల్లే అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక అవకాశం వృథా చేసుకుని ఖరీదైన గుణపాఠం నేర్చుకున్నాం అని నిర్మాత విష్ణువర్దన్ అన్నారు. రెండు పార్టులు కాకుండా ఒకే పార్టుగా తీసి విడుదల చేసి ఉంటే బాగుండేదేమో అని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... ఆ గుణపాఠం తర్వాత కూడా అక్కడి వివాదాలను ఆయనేమీ ప్రస్తావించలేదు. అది పక్కన పెడితే... మళ్లీ ఆయన బయోపిక్ లు తీస్తున్నారు. ఇపుడు రెండు బయోపిక్ లపై ఆయన దృస్టిసారించారు. ఒకటి కపిల్ దేవ్ బయోపిక్ అయితే, ఇంకోటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్.