గూస్ బంప్స్ : ఎన్టీఆర్ మొదటి రాజకీయ ప్రసంగం

August 08, 2020

తెలుగు జనతకు వందనం

తెలుగు యువతకు అభివందనం

తెలుగు మమతకు అభివాదనం

తెలుగు జాతికి శుభాభివందనం

హరిజన గిరిజన దళిత వర్గాలు.. గూడాల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతు ఉంటే...చూసి భరించలేక, వెనుకబడిన తరగతి ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూంటే మీ కోసం వచ్చాడు ఈ తెలుగుదేశం శ్రామికుడు.

ఎన్టీఆర్ ప్రసంగం ఇలా మొదలైంది. వచ్చే ప్రతిమాట నాభిలోంచి వైబ్రేషన్, హృదయంలోని సున్నితత్వం కలగలపి బయటకు తూాటాల్లా తన్నుకువస్తుంటే ఆనాడు తెలుగు ప్రజలు ఉర్రూతలూగిపోయారు. ఇది కదా మన జీవితానికి కావల్సింది అంటూ ఆనాడే తెలుగుదేశంను మనసులో ముద్రించకున్నారు. మీకోసం ఆనాటి వీడియో వెదికిపెట్టాం. కింద వీడియో క్లిక్ చేయండి. 

 

ఒకనాడు పార్టీ కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తున్న వీడియో కింద చూడొచ్చు