బే ఏరియాలో అన్నగారి జయంతి

August 06, 2020

తెలుగువాళ్లు ఎక్కడున్నా అన్నగారిని మరిచిపోరు. ​బే ఏరియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్‌ రెస్టారెంట్‌లో అన్న నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలను అన్నగారి అభిమానులు, ఎన్నారై టీడీపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. వెంకట్‌ కోగంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ లాంటి మహోన్నత నటుడికి సాటిరాగల నటుడు లేరని, మరి ఇక రారన్నారు. ఎన్టీఆర్‌ ప్రజల మనిషి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాతే తెలుగు ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో తెలిసిందన్నారు.
ఈ కార్యక్రమంలో సతీష్‌ అంబటి, కోనేరు శ్రీకాంత్‌, సతీష్‌, వాసు బండ్ల, గాంధీ పాపినేని, రాజు, కొల్లి రాజా, గోకుల్‌, సుబ్బయంత్ర, గుమ్మడి కృష్ణ ప్రసాద్‌ మంగిన, వెంకట్‌ కోడూరు, సురేష్‌, శివరాం దివితోపాటు పలువురు పాల్గొన్నారు.​