ఎన్టీఆర్ పై దుష్ప్రచారాలను చెప్పుతో కొట్టిన ఇంటర్వ్యూ ఇది

August 13, 2020

ఒక సామాన్యుడి గురించి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది. అదే సెలబ్రిటీలకు అయితే... అది కూడా ఎన్టీఆర్ వంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లకు అయితే... ఎవరు సరైన నిజాలు చెప్పలగరు? 

గెస్ చేయగలరా మీరు ?

కచ్చితంగా డ్రైవర్ సరైన నిజాలు చెప్పగలడు. ఎందుకంటే.... బలమైన వ్యక్తులు తమ బలహీన క్షణాలను ఇంట్లో పంచుకోరు. ఇతరులతోను పంచుకోరు. అలాంటి వారు వర్క్ ప్లేస్ లో ఒంటరిగా బాధపడటానికి ఖాళీగా ఉండరు. ఎపుడూ ప్రముఖులతో మీటింగులతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కాస్త ప్రశాంతంగా కొన్ని క్షణాలు గడిపేది. ఠక్కున తమ ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని చూపేది వాహన ప్రయాణంలోనే. ఇలాంటి వారు చాలా నమ్మకమైన ఆత్మీయులైన వారిని డ్రైవరుగా పెట్టుకుంటారు. పైగా ఎన్టీఆర్ కు డ్రైవరుగా పనిచేసిన వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలు ఆయనతోనే ఉన్నారు. బహుశా కొడుకుల కంటే కూడా ఎన్టీఆర్ గురించి ఆయనకు ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది.

రాజకీయాల్లో సినిమాల్లో పాపులర్ అయిన ఎన్టీఆర్ ఎక్కువ సహజంగానే వాహన ప్రయాణంలో ఎక్కువ గడిపారు. అతని తిండి, మాట, భావోద్వేగాలు కచ్చితంగా ఆ డ్రైవరుకు తెలిసే ఉంటాయి. మరి ఇపుడు ఆ సమాచారం ఎక్కడుంది అంటారా? ఇదిగో ఆ డ్రైవరు లక్ష్మణ్ ను ఒక యుట్యూబ్ ఛానెల్ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. అందులో లక్ష్మీపార్వతి గురించి ఆయన చేసిన సంచలన కామెంట్లు కూడా ఉన్నాయి.