సర్ ప్రైజ్ - ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చిన ఆ హీరోయిన్

August 03, 2020

పూనమ్ కౌర్... టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోని బ్యూటీ. అందచందాలకు కొదవలేకున్నా సరైన బ్రేక్ రాలేదు ఈ అమ్మడికి... ఈమె క్యూట్ నెస్ కి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 

అయితే... సడెన్ గా పూనమ్ కౌర్ ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చింది. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించింది. గతంలో ఆమె ఎన్నడూ జయంతి రోజు ఇలా ఘాట్ కి వచ్చి నివాళులు అర్పించిన దాఖలాలు లేవు. ఎందుకో మరి ఈసారి సడెన్ గా వచ్చారు.

ఈ సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె ఏమన్నదంటే...

‘‘ఎన్టీఆర్ జయంతి.... మీరు తెలుగు ప్రజలకు దేవుడు. నన్ను స్వర్గం నుంచే దీవించండి. దుష్టశక్తులతో పోరాడే బలాన్ని ప్రసాదించండి. మీ లాంటి నాయకులు, మీ వంటి నటులు నేటి సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే మానవత్వం నశించిపోతున్న రోజులువి’’ 

NTRJayanthi ....... god of telugu people ...bless me from heaven .... bless me that I fight the evils ..... leaders like you n actors like u are the most needed now where there is humanity lacking ....#NTRamaRao #Hero 

వీడియో: ఎన్టీఆర్ ఘాట్ లో పూనమ్ కౌర్