లక్ష్మీ ప్రణతి... ఎన్టీఆర్ భార్య ఎందుకు వైరల్ అవుతోంది

August 13, 2020

లక్ష్మీ ప్రణతి... సోషల్ మీడియాలో ఈ పేరు ట్రెండవుతోంది. ఎందుకు ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఇది ఎన్టీఆర్ - లక్ష్మీప్రణతి 9వ వివాహ వార్షికోత్సవం. చూస్తూ చూస్తూనే 9 సంవత్సరాలు అలా దొర్లిపోయాయి కదా. అవును... అందుకే వారిద్దరు ట్రెండవుతున్నారు. అంతేకాదు... లక్ష్మీప్రణతి సపరేట్ గా ట్రెండవుతుండటం విశేషం. పెళ్లయ్యాక... ఇంతవరకు ఆమె ఎక్కడా మాట్లాడినట్టు వార్త గాని, వీడియో గాని రాలేదు. వారి వివాహ బంధం కలకాలం కొనసాగాలని అభిమానులు ఆశీర్వదిస్తున్నారు. మనం కూడా వారి కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కొన్ని ముచ్చటైన ఫొటోలు మీకోసం కింద స్లైడ్ షోలో ఉన్నాయి.