అల వైకుంఠపురములో ఇల్లు.. ఎవరిదో తెలుసా??

June 01, 2020

సంక్రాంతి బరిలోకి దిగి.. పండుగ విజేతగా నిలిచిన అల వైకుంఠపురములో.. మొత్తం ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వావ్ అనిపించేలా ఉండే ఈ ఇల్లు సెట్టింగ్ ఏ మాత్రం కాదు. రియల్ అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అత్తారింటికి దారేది చిత్రంలో విశాలంగా ఉండే ఇల్లు రామోజీ ఫిలిం సిటిలో నిర్మించారు. ఈ సినిమా కోసం నిర్మించిన ఆ ఇంటిని అలా ఉంచేశారు.
అల్లు అర్జున్ తాజా చిత్రం అల వైకుంఠపురములో కీలకమైన వైకుంఠపురం ఇల్లు సినిమా సెట్ కాదు. అది రియల్ ఇల్లు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ చేసిన  ఇల్లు అదిరిపోయేలా ఉండటమే కాదు.. ఉంటే ఇలాంటి ఇల్లు ఉండాలన్నట్లుగా ఉన్న ఈ విలాసవంతమైన భవనాన్ని చూసినంతనే త్రివిక్రమ్ ఈ ఇంట్లోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇల్లు ఒక న్యూస్ ఛానల్ కుమార్తె ఇల్లుగా చెబుతున్నారు. అనుకోకుండా ఈ ఇంటిని చూసిన త్రివిక్రమ్.. తమ కథకు తగిన ఇల్లుగా ఫిక్స్ అయ్యారట. ఇంటి ఓనర్లతో మాట్లాడిన వెంటనే వారు ఆనందంగా ఓకే చేశారట. మరి.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ముచ్చటపడి.. మీ ఇంటిని నా సినిమా కోసం ఇస్తారా? అంటే ఇవ్వకుండా ఉంటారా చెప్పండి.
ఈ ఇంట్లోనే 20 రోజుల పాటు షూట్ చేసిన సందర్భంలోనే అల్లు అర్జున్ సైతం తనకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలన్న భావన కలిగిందట. అంతేకాదు.. తాను కట్టుకునే కొత్త ఇంటికి అవసరమైన డబ్బుల్ని తన తండ్రి కమ్ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ను అడుగుతానని చెప్పారు. అల చిత్రంతో ఫేమస్ అయిన ఇంటి వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.