కరోనా భయం - ఊర్లోకి రానివ్వలేదని, అడవిలోకి పోయాడు

August 14, 2020

అది ఒరిస్సాలోని గంజాం జిల్లా. తమిళనాడులోని చెన్నైలో పనిచేసే ఒక కూలీ సొంతూరికి వచ్చాడు. అతని పేరు బరిక్ నాయక్. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి రైలులో అవకాశం దొరికింది. చెన్నై నుంచి రైలు ద్వారా బాలాసోర్ కి వచ్చాడు. అక్కడి నుంచి తన ఊరికి దగ్గర్లోని బంజానగర్ కి బస్సులో వచ్చాడు. ఇది కూలీల కోసం అరేంజ్ చేసిన బస్సు. తీరా సంతోషంగా ఇంటికి వెళ్దాం అని వస్తే... ఊర్లో ఎవరూ రానివ్వలేదు. గ్రామ సర్పంచి, ఇతర స్థానిక సిబ్బంది అతడిని రానివ్వలేదు.

తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా భయంకరంగా ఉంది. నీకు ఉండే ఉంటుంది. నువ్వు ఊర్లోకి వస్తే అందరికీ కరోనా అంటిస్తావు. కాబట్టి నువ్వు ఊర్లోకి రావడానికి వీల్లేదని నాయక్ కు చెప్పారు. అతనికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు ఊరికి దగ్గర్లో ఉన్న ఒక అడవిలోకి వెళ్లిపోయాడు. అతని ఇంట్లో వారు కొన్ని తినుబండారాలు, దుప్పటి చాప తెచ్చిస్తే వాటిని తీసుకుని అడవిలోకి పోయాడు.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి పోలీసుల దాకా చేరింది.

పోలీసులు అతడిని చేరుకుని అడవి నుంచి తీసుకెళ్లారు. సానకొండాడ అనే చిన్న టౌన్లోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. చూశారా కరోనా వల్ల తెలిసిన వారికి కూడా శత్రువులు అవుతున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని విపరిణాామాలు అంతుపట్టని విధంగా ఉన్నాయి.