నో అన్నారు... ఇపుడు దిగొచ్చారు

June 05, 2020
CTYPE html>
ప్రపంచ దేశాల గడగడలాడిస్తున్న కరోనా వైరస్ క్రీడలపైనా పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా కరాల స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడగా తాజాగా విశ్వ క్రీడా సమరంగా పరిగణిస్తున్న ఒలిపింక్స్ కూడా ఈ ఏడాది వాయిదా పడిపోయాయి. అదే సమయంలో భారత్ లో వరల్డ్ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు వాయిదా దిశగా సాగుతోంది. ఈ మేరకు మంగళవారం ఐపీఎల్ జట్ల యాజమాన్యాలతో భేటీ అయిన బీసీసీఐ... ఐపీఎల్ ను వాయిదా వేసే దిశగా సమాలోచనలు చేస్తోంది. నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఒలింపిక్స్ ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లుగా  అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయాలని అనేక సభ్య దేశాలు డిమాండ్ చేస్తున్నా... ఐఓసీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే క్రీడలు నిర్వహించేందుకు పట్టుదల ప్రదర్శించింది.
అయితే అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రం కావడంతో జపాన్ ప్రధాని షింజే అబేతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ మంగళవారం సమావేశమయ్యారు. జపాన్ గడ్డపై జరగాల్సిన ఒలింపిక్స్ ను వాయిదా వేయడమే శ్రేయస్కరమని వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లుగా వారిద్దరూ ప్రకటించారు. అయితే ఈ ఏడాది వాయిదా పడిపోయిన ఒలింపిక్స్ ను వచ్చే ఏడాది నిర్వహించే అవకాశాలున్నాయి. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 124 ఏళ్లలో ఒలింపిక్స్ వాయిదా పడడం ఇదే ప్రథమం.