మాజీ సీఎం సెటైర్ ఓ రేంజ్ లో పేలింది

August 03, 2020

బయటకు పోవడానికి బద్దకించిన వారు ఇపుడు బయటకు ఎపుడు వెళ్దామా అని తహతహలాడుతున్నారు. అదేంటో ఏం చేయొద్దంటే దాని మీదే అందరికీ ఆసక్తి కలుగుతోంది. కరోనాని మన దేశం నుంచి తరిమేయడానికి 14 రోజులు ఇంట్లో ఉండండి అంటే జనం వినడం లేదు. అది పెద్ద కష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉండి తాజాగా విడుదలైన జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై పెద్ద సెటైర్ వేశారు.  క్వారంటైన్ లో ఉండేందుకు ఇబ్బందిపడేవారందరికీ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా టిప్స్ ఇస్తానంటున్నారు.

లాక్ డౌన్, క్వారంటైన్ లలో నెలల తరబడి గడిపిన అనుభవం తనకుందంటూ సెటైరికల్ ట్వీట్స్ చేశారు ఒమర్. మీకోసం ఒక బ్లాగు కూడా రాస్తా అంటున్నారు.8 నెలల తరవాత ఒమర్ అబ్దుల్లాపై బయటకు వచ్చి వేసిన ఈ సెటైర్ కు ప్రముఖులు రిప్లై ఇచ్చారు. తన మాటలను సీరియస్ గా తీసుకోవద్దు అంటూ ...లాక్ డౌన్, క్వారంటైన్ ల పై టిప్స్ ఇస్తానంటున్నారు. ఒమర్ లోని హాస్యచతురత ఇంకా అలాగే ఉందంటూ ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ రీట్వీట్ చేశారు. క్వారంటైన్ లో ఉన్నా...సెటైరికల్ నేచర్ తగ్గలేదంటూ ఒకరు...ఆ అనుభవాలను స్వయంగా చూసేందుకే మిమ్మల్ని క్వారంటైన్ చేశారంటూ మరొకరు కామెంట్స్ చేశారు.

రితుపర్ణ చటర్జీ పుస్తకం ఏదీ మీరు నన్ను డిజప్పాయింట్ చేశారు అంటూ.. మీరు నిర్బంధం నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందంటూ పేర్కొంది. మీలో మంచి స్పిరిట్ ఉంది అంటూ ఎకనమిస్ట్ రూపా సుబ్రమణ్య వ్యాఖ్యానించారు. ఒమర్ వేసిన ఈ సరదా ట్వీటును సుమారు 8 వేల మంది షేర్ చేశారు. ఇదిపుడు ట్రెండవుతోంది.