వైసీపీ లేడీ లీడర్ కారుపై మంత్రి స్టిక్కర్ ?

August 05, 2020

ఏపీలో రాజకీయాలు భలే ఆసక్తిగా ఉంటాయి. ప్రపంచం బాధ ఒకటైతే, ఏపీ బాధ ఇంకోటి. ఇటీవలే తమిళనాడు కారు స్టిక్కరు గొడవ ఎంత పెద్దగా జరిగిందో చూశాం. మంత్రి బాలినేని అఫిషియల్ స్టిక్కరుతో ఉన్న కారులో కోట్లు పట్టుబడ్డాయి. దానిపై విచారణ జరుగుతోంది. 

తాజాగా వైకాపా మహిళా నేత ఒకరు విజయవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు. ఆమె వెల్లంపల్లి అనుచరం వర్గం ఏమో అనుకునేరు. ఈ స్టిక్కర్ వేసుకుంది విజయవాడకు చెందిన వైసీపీ నేత కాదు. ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత. ప్రస్తుతం ఈమె ఒంగోలు మేయర్ అభ్యర్థి. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. మొన్నబాలినేని ప్రెస్ మీట్ కు వచ్చారు. అపుడు ఆమె కారుపై మంత్రి వెల్లంపల్లి స్టిక్కర్ కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉన్న గొడవలు అన్నీ చాలవన్నట్లు ఈ స్టిక్కర్ల గొడవేందో. ఒక మంత్రి స్టిక్కరు ఆయన అనుచరులో, ఆయన జిల్లా వారో వేసుకుంటో మామలే అనుకోవచ్చు. నిజానికి మంత్రి వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు మంత్రి స్టిక్కర్ ఉండకూడదు.  కానీ గంగాడ సునీత ఆ నిబంధన ఉల్లంఘించడమే కాకుండా ఎక్కడో విజయవాడ మంత్రి స్టిక్కరు వేసుకోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.