ఎన్ఆర్ఐలకు ఎవరు ఏం చేసారో బహిరంగ చర్చకు సిద్ధమా?--బుచ్చి రాం ప్రసాద్-టీడీపి ఎన్ ఆ ర్ ఐ కో ఆర్డినేటర్

June 06, 2020

ఎన్ఆర్ఐ ల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు కి లేదని వైసీపీ అనటం బాహుబలి సినిమా గురించి మాట్లాడే హక్కు రాజమౌళి కి లేదు అన్నట్లు ఉంది. రైతు బిడ్డలు, రైతు కూలీల బిడ్డలని విదేశాల్లో ఉన్నత స్థాయి ల్లో ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు ముందు చూపే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విప్లవం సృష్టించి వేలాది మంది యువతకి ప్రపంచ దేశాల్లో స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదే. టీడీపీ హయాంలో ఏపీ ఎన్ఆర్ టీని ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐల‌కు అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించాం. అమరావతి పరిసరాల్లోనూ ఐటీ పరిశ్రమను సిలికాన్ వ్యాలీ తరహాలో నిర్మించేందుకు ఎన్ఆర్ఐలంద‌రిని ఒకే గొడుగు కింద‌కు తీసుకువ‌చ్చాం. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు (ఏపీఎన్‌ఆర్‌టీ) పాలక మండలి ప్రవా సాంధ్రుల సంక్షేమం – అభివృద్ధికి సంబంధించి కొత్త పాలసీని. అదే విధంగా ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగినా ప్రవాసాంధ్ర భరోసా పథకం ద్వారా రూ. 10లక్షల బీమా సౌకర్యం కల్పించాం.
ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ సభ్యులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
ఏపీఎన్ఆర్టీ, టీడీపీ ప్రభుత్వం సంయుక్తంగా ఐటీ పరిశ్రమ విస్తరణ కృషి జరిగింది. లక్ష మంది ప్రవాసాంద్రులను ఏపీఎన్ఆర్టీ సభ్యులుగా చేయడంతో పాటు.. 75 కంపెనీలను అమరావతికి తెచ్చేందుకు కృషి చేసాము.

చంద్రబాబునాయుడు గారు ఐటీ డెవలప్ చేస్తే వైకాపా నాయకులు రాష్ట్రంలోని సహజ వనరులు లూటీ చేసి విదేశాల్లో దాచారు.
ఎన్నారైలకు తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదనే వైకాపా పైడ్ ఆర్టిస్టులు బహిరంగ చర్చకు సిద్ధమా? ఎన్ ఆ ర్ ఐ లను కోర్టు కీడ్చిచింది వైసీపీ ప్రభుత్వం కదా? ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్రంలో ఎన్ఆర్ ఐ లు పెట్టిన పెట్టుబడి రూ. 40 కోట్లు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వటం వేదింపు చర్యలు కాదా? రాజధాని మార్చాలని నిర్ణయం తీసుకున్నపుడు వారి పెట్టు బడులు ఎందుకు వెనక్కి ఇవ్వరు? ఏపీ ఎ న్ ఆర్టీ ని నీరు గార్చింది మీరు కాదా?విదేశాలకు వెళ్లే యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని మీరు రద్దు చేయటం వస్తావం కాదా? విదేశాల్లో చదుకునే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేస్తే వాటిని కూడా నిలిపి వేయటం కక్ష సాదింపు చర్య కాదా ? చంద్రబాబు నాయుడు గారు ఏ పి ఎన్ ఆర్ టీ ఏర్పాటు చేసి హ్యాపీ నెస్ట్ సౌకర్యం ద్వారా ఎన్ఆర్ఐలకు ప్లాట్లు కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేశారు
జగన్ అధికారంలోకి రాగానే ఏం చేశావు హ్యాపీనెస్ట్ నిలిపివేసిన మాట వాస్తవం కాదా? ఏపీ ఎన్నార్టీ వారు చేపట్టిన ఐకాన్ బిల్డింగుల నిర్మాణాన్ని ఆపివేసిన మాట వాస్తవం కాదా? దేశంలో 400 పైగా రాజకీయ పార్టీలు ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్ఆర్ఐ తో మాట్లాడిన పాపాన పోలేదు ఒక చంద్రబాబు నాయుడు గారే ఎన్నారైల తో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని కరోనా మహమ్మారి బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.కరోనా వంటి జాతీయ విపత్కర పరిస్థితుల్లో ఎన్నారైల గురించి పట్టించుకోకుండా ఎన్ఆర్ఐ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా చంద్రబాబు నాయుడు గారి పై దాడికి దిగడం మీ చేతకాని తనానికి నిదర్శనం.
చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం లక్షణం, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ చూసి నా రైలు వెయ్యి మందికి పైగా చంద్రబాబు నాయుడు గారితో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు యూట్యూబ్ లో లక్షలాది మంది చూశారు. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, విశ్వసనీయతకు ఎన్ఆర్ఐలు మద్దతు ప్రకటించారు చంద్రబాబునాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలను పాటించడానికి సంఘీభావం తెలిపారు
ఏపీ ఎన్ఆర్ఐ లో చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతున్న ఆదరణ చూసి వైకాపా నాయకులు ఎందుకు భయపడుతున్నారు? ఎన్ఆర్ ఐ లకు చంద్రబాబు చేసిందేమీ లేదని నార్త్ అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిథి పండుగాయల రత్నాకర్ మాట్లాడండం చూసి ఎన్ ఆ ర్ ఐ లు నవ్వుకుంటున్నారు. వారికి చంద్రబాబు ఏం చేశారో తర్వాత తెలుసుకుందువు గానీ, అసలు ముందు నీకు ఆ పదవి భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు అన్న విషయం తెలుసుకోవాలి. చంద్రబాబు ఆ పదవి సృష్టించడం వల్లే నువ్వు ఆ స్థానంలో ఉన్నావన్న విషయం గుర్తుచుకోవాలి