ఆద్వానీ కోసం ప్ర‌తిప‌క్షాలు

May 27, 2020

దేశంలో బీజేపీ దాదాపు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితుల్లో అద్వాని రామ‌మందిరం నినాదంతో దేశ వ్యాప్తంగా యాత్ర నిర్వ‌హించారు. బాబ్రీ వివాదానికి కార‌ణ‌మ‌య్యాడు. చివ‌ర‌కు అత‌ని వ‌ల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. అయితే అద్వాని ప్ర‌దాని అయితే మ‌త క‌ల‌హాలుపెరుగుతాయ‌ని వాజ్‌పేయిని పీఠం ఎక్కించారు. అప్ప‌టి నుంచి ఆద్వాని పార్టీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కాని మోదీ ప్ర‌భుత్వం అదికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌పై నిర్ల‌క్ష్య దోర‌ణి పెరిగింది. చివ‌ర‌కు లోక‌స‌భ ఎన్నిక‌ల్లో ఆద్వానికి టికెట్లు ఇచ్చేందుకు కూడా పార్టీ నిరాక‌రించ‌డంతో పాటు ఆయ‌న సీటులో అమిత్ షాను నిలిపించారు. దీంతో అద్వాని ఓంట‌ర‌య్యారు. దీన్నె త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. ఈ క్రమంలో పార్టీలకతీతంగా ప్రతిపక్షాలు అద్వానీకి మద్ధతు పలుకుతున్నాయి. బీజేపీని ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప నేతలను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ మోడీ, అమిత్ షాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ ఉప ప్రధానిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య ఉండే మర్యాదలపై అద్వానీ చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉందన్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన వ్యాఖ్యల్ని తామంతా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. ఉన్నత విలువలు, రాజనీతి కలిగిన గొప్ప నేతలను ఆదర్శంగా తీసుకోవాలని కానీ.. పట్టించుకోకుండా ఉండొద్దని.. వారి సూచనలకు విలువ ఇవ్వకపోవడమంటే వారిని అవమానించడమేనని వాద్రా అభిప్రాయపడ్డారు. అద్వానీ బీజేపీకి మూలస్తంభం లాంటివారని.. కానీ సొంత పార్టీనే ఆయనను మరిచిపోవడం బాధాకరమన్నారు. మోడీ జీ మీ ఢిల్లీ ప్రయాణంలో సాయం చేసిన వ్యక్తి చెప్పే మాటలు వినండి అంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. ఆద్వానీ బీజేపీకి ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నార‌ని ఆపార్టీ నాయ‌కులే చెవులు కొరుక్కుంటున్నారు.