అందరినీ షాక్ కి గురిచేసిన కేఏ పాల్

August 03, 2020

చైనాలోని వుహాన్ లో పుట్టిన కోవిడ్‌-19 అలియాస్ కరోనా వైరస్‌ 162 దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1,82,547 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ పిశాచి వైరస్ బారిన పడి ఇప్పటివరకు 7,164 మంది మృతి చెందారు. ఇక, భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 129కి చేరింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో  ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియాన్ని 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లకు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయం చేస్తానని కేఏ పాల్ అన్నారు. ఏపీ, తెలంగాణలో ఉన్న తన చారిటీ సిటీస్ లను ప్రభుత్వాలు బాధితుల చికిత్స కోసం  వాడుకోవచ్చిన పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలోని సంగారెడ్డిలో 300 పడకల సామర్థ్యమున్న చారిటీ సిటీ, ఏపీలోని విశాఖలో 100 పడకల సామర్థ్యమున్న చారిటీ సిట ఉన్నాయని, వాటిని కేసీఆర్, జగన్ వాడుకోవచ్చని అన్నారు. అంతేకాదు, వాటిని వాడుకున్నందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కరలేదని పాల్ మరో ఆఫర్ ఇచ్చారు. కరోనా బాధితుల కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పాల్ అన్నారు. మరి, పాల్ ఆఫర్ ను జగన్, కేసీఆర్ స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.