`ఆస్కార్-2020` విజేత‌ల జాబితా ఇదే!

June 03, 2020

లాస్‌ఏంజెల్స్‌లో 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జ‌రిగింది. హాలీవుడ్ ప్ర‌ముఖులు, తారాగ‌ణ‌మంతా ఆస్కార్ వేడుల్లో సందడి చేసింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్ ప్లే, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌ విభాగాల్లో నాలుగు `ఆస్కార్‌` లను `పారాసైట్` సొంతం చేసుకుంది. క్రిటిక్స్ మ‌న‌సు గెలుచుకున్న‌`1917` సినిమా విజువల్‌ ఎఫెక్ట్‌, సౌండ్‌ మిక్సింగ్‌, సినిమాటోగ్రఫీ విభాగాల్లో 3 అవార్డులను ద‌క్కించుకుంది. ఇక‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నందుకున్న‌`జోకర్‌` సినిమా హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడిగా ఎంపిక‌య్యాడు. `వన్స్ అపాన్  ఏ టైమ్ ఇన్ హాలీవుడ్` చిత్రంలో నటననకు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కించుకున్నాడు. జూడి చిత్రానికి గాను రెంజి జెల్వెగర్ ఉత్తమ నటిగా ఎంపికైంది. `మ్యారేజ్ స్టోరీ` చిత్రంలో న‌ట‌న‌కు లారా డెర్న్ ఉత్తమ సహాయక నటి అవార్డు ద‌క్కించుకుంది.

92వ ఆస్కార్‌ అవార్డుల విజేత‌లు:

ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)
ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే  : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో