ఇమ్రాన్ పై పాక్ పత్రిక సంచలన కథనం

May 29, 2020
CTYPE html>
ఐక్యరాజ్య సమితి సర్వసభ్యుల సమావేశంలో ఇమ్రాన్ ప్రసంగం అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపించటం తర్వాత.. ఆయన వాదనల్ని రెండు.. మూడు దేశాలకు మించి మద్దతు లభించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయంలో తాను ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ లో సాంకేతిక సమస్య తలెత్తటంతో అత్యవసర ల్యాండింగ్ అయినట్లుగా తెలుసు కదా.
అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి పాక్ మీడియా సంస్థ ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. టెక్నికల్ సమస్య కారణంగా ఇమ్రాన్ జెట్ ను ల్యాండ్ చేయలేదని.. అందుకు కారణం వేరే ఉందంటూ ఆసక్తికర కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇప్పుడీ కథనం వైరల్ గా మారటమే కాదు.. ఇమ్రాన్ కు మరో తలనొప్పిగా మారింది.
ఇంతకూ జరిగిందేమంటే.. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ రెండు రోజులు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తన దేశానికి వచ్చిన ఇమ్రాన్ కమర్షియల్ విమానంలో వెళ్లటం సౌదీ రాజు ఇష్టపడలేదట. దీంతో.. తన ప్రైవేటు జెట్ ఇచ్చి అమెరికాకు వెళ్లమని చెప్పారట.
అందుకు ఓకే అన్న ఇమ్రాన్ అమెరికాకు వెళ్లటం వరకూ అంతా మామూలుగానే నడిచింది. అమెరికా పర్యటనలో భాగంగా ఇమ్రాన్ మాష్టారు.. సౌదీ రాజుకు ఏ మాత్రం ఇష్టపడని పనులు కొన్నింటిని చేశారు. అందులో ముఖ్యమైనది సౌదీ రాజుకు ఏ మాత్రం నచ్చని ఇరాన్ తో మాట్లాడటం మరో ఎత్తుగా చెబుతున్నారు.
అంతేకాదు.. టర్కీ అధ్యక్షుడు.. మలేషియా ప్రధానితో కలిసి ఇస్లామిక దేశాల వాదనను వినిపించాలనుకోవటం సౌదీ రాజుకు తెలీకుండా జరిగిందట. ఇది సరిపోనట్లు.. తన ప్రత్యర్థి ఇరాన్ తో చర్చలుజరపటం ఏ మాత్రం నచ్చలేదు. దీంతో.. ఇమ్రాన్ కు తాను స్నేహంలో భాగంగా ఇచ్చిన ప్రైవేట్ జెట్ ను వెంటనే తనకు పంపించాలని కోరారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యూయార్క్ లో ల్యాండ్ అయిన ఇమ్రాన్.. సాంకేతిక సమస్య పేరుతో మరో విమానంలోకి మారారు. ఈ ఉదంతానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని పాకిస్తాన్ కు చెందిన ఫ్రైడే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇప్పుడీ కథనం సంచనలంగా మారింది.