తనకు తాను పరువు తీసుకున్నాడు

July 12, 2020

అది సాక్ష్యాత్తు దేశ ప్రధాని కార్యాలయం. మరి.. అలాంటి ఆఫీసుకు కరెంట్ కట్ చేస్తామని వార్నింగ్ ఇవ్వటాన్ని చేయటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? అన్నది ఇప్పుడు ప్రశ్న. కశ్మీర్ మీద మోడీ సర్కారు తీసుకున్ననిర్ణయాల నేపథ్యంలో అదే పనిగా.. దారుణ వ్యాఖ్యలు చేస్తూ.. అణు యుద్ధానికి సైతం వెనుకాడమంటూ మాటలు మిగులుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ కు ఆ దేశ విద్యుత్ సరఫరా సంస్థ షాకిచ్చింది.
ఇస్లామాబాద్ లోని ప్రధాని కార్యాలయానికి సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిల నేపథ్యంలో కరెంట్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చేసింది. పీఎంవో సెక్రటేరియట్ కు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై సంస్థ (ఇస్కో) తాజాగా నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకూ విద్యుత్ బకాయి బిల్లుల కారనంగా రూ.41 లక్షల మేర బిల్లులు చెల్లించలేదని పేర్కొంది.
అంతేకాదు.. గత నెలలో కట్టాల్సిన రూ.35 బకాయిలు సైతం అలానే ఉన్నాయని పేర్కొంది. వరుసగా రెండునెలలు కరెంటు బిల్లులు చెల్లించని నేపథ్యంలో తాజా వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే పనిగా.. అణుయుద్ధం గురించి మాట్లాడే పాక్ ప్రధాని ఇమ్రాన్.. ముందు తన పీఎం ఆఫీసు కట్టాల్సిన విద్యుత్ పెండింగ్ బిల్లుల్ని కట్టేస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.
పీకల్లోతు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్.. ముందు తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సింది పోయి.. అదే పనిగా కశ్మీర్ మీదా.. యుద్ధం మీదా వ్యాఖ్యలు చేయటం తగ్గిస్తే ఇమ్రాన్ కు బాగుంటుందేమో? కశ్మీర్ మీద దేశ ప్రజల్ని రెచ్చగొడుతూ.. దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితి బయటకు రాకుండా ఉండేందుకు ఇమ్రాన్ కిందామీదా పడుతున్నారా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.