పరిటాల ప్రత్యర్థికి కరోనా

August 08, 2020

అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ పై రాప్తాడు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయన పలు కార్యక్రమాల్లో గుంపుగుంపులుగా తిరగడంతో కరోనా సోకిందని తెలుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలిందట. 

పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన అనంతరం ప్రకాష్ రెడ్డి హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటికే ఆయన గన్ మెన్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న మరో 16 మందికి పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు ఇంకా బయటకు రాలేదు. 

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. తెలంగాణలో హోంమంత్రికి, డిప్యూటీ స్పీకరుకు కరోనా సోకింది. దీనికి కారణం మాత్రం వారి నిర్లక్ష్యమే అని అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇక ఏపీలో ఉత్తరాంధ్రకు చెందిన శృంగవరపుకోట ఎమ్మెల్యేకి, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేకి కరోనా సోకిన విషయం తెలిసిందే. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.