పరిటాల సునీత ఇంట్లో సందడి

August 05, 2020

పరిటాల సునీత చిన్న కొడుకు, పరిటాల శ్రీరామ్ తమ్ముడు పరిటాల సిద్ధార్థ వివాహ రిసెప్షన్ వేడుక గురువారం సాయంత్రం పరిటాల స్వగ్రామం నసనకోటలో ఘనంగా జరుగుతోంది. ఈ నెల మొదట్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈరోజు నసనకోటలోని టిటిడి దేవస్థానంలో ఈ వివాహానంతర వేడుక జరగుతోంది. పరిటాల రవి నియోజకవర్గం రాప్తాడుకు చెందిన ప్రజలతో పాటు అనంతపురం జిల్లా తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

పరిటాల బంధువులతో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.  రెండు రోజుల క్రితం పెళ్లికొడుకు ఫంక్షన్ జరిగింది. నేటి ఉదయం వివాహం జరిగింది. సాయంత్రం అభిమానులు, బంధువుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు.