జగన్ కి పరిటాల ఫ్యామిలీ ఛాలెంజ్

February 23, 2020

తెలుగుదేశం వారందరిపై ప్రజలు నమ్మేదాకా నిందలు వేయాలని వైకాపా శ్రేణులకు అధిష్టానం గట్టి నిబంధనలు పెట్టినట్టుంది. అందుకేనేమో ఉదయం లేచిదగ్గరనుంచి వైకాపాలో నెం.1 లీడర్ అయిన జగన్ నుంచి చివరి కార్యకర్త వరకు తెలుగుదేశం వారిపై అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశానికి చెందిన ఏ ఒక్క నేతను వదలడం లేదు. ఆ క్రమంలో పరిటాల కుటుంబం కూడా వారి టార్గెట్టే. 

జగన్ బాకా టీం... చేస్తున్న దుష్ర్పచారంపై పరిటాల కుటంబం కూడా ఘాటుగానే స్పందించింది. జగన్ సర్కారు పచ్చి అబద్ధం చెప్పిందని పరిటాల తనయుడు పరిటాల శ్రీరామ్ తేల్చేశారు. అది ఆయన మాటల్లోనే వింటే...

Paritala Sreeram@IParitalaSriram
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్..!!

మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తాం..
మీ ప్రభుత్వానికి నిరూపించే దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి..!! @ysjagan

మేము అవకతవకలకు పాల్పడలేదు కాబట్టే జగన్ ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు. ఆధారాలు లేవు కాబట్టే వారు ఇలాంటి దుష్ర్పచారానికి ఒడిట్టారు. పాలన చేతగాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సమర్థత లేక... ఎదుటి వారి మీద బురద జల్లి ముఖ్యమంత్రి తప్పించుకుతిరుగుతున్నారు అని పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత ఆరోపించారు.