పరిటాల ఇంట తీవ్ర విషాద ఘటన

August 13, 2020

తెలుగుదేశానికి సుపరిచితమైన కుటుంబం పరిటాల ఇంట్లో తీవ్ర విషాదఘటన చోటుచేసుకుంది. పరిటాల రవి భార్య, మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం మరణించారు. ఈ అనూహ్య ఘటనతో పరిటాల కుటుంబం శోకంలో మునిగిపోయింది. 

ఈయన అత్యధిక కాలం నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. ఆలయ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఇది అనంతపురం జిల్లాలో అత్యధిక భక్తులు సందర్శించే ఆలయాల్లో ఒకటి. ఆలయం పురాతనమైనదే అయినా పరిటాల కుటుంబం ఆలయ పరిసరాలను మరింతగా అభివృద్ధి చేసింది. ఇదంతా ధర్మవరపు కొండయ్య ఆధ్వర్యంలోనే జరిగింది.