ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం...

August 15, 2020

అదేంటండీ అంత మాట అనేశారు? అంటారా... మరి అంతేకదండీ... రైళ్లు జనం అటు ఇటు తిరక్కుండా అది ఇది తాకకుండా, ఉత్తిత్తినే బాత్ రూమ్ లు ఫేష్ వాష్ లు చేయకుండా ఉంటారా? ఉండరు. మరి అలాంటి వాళ్లలో ఒక్కరికి కరోనా ఉంటే ఇక రైళ్లలో ఒక్కో రెండు బోగీలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నా.. అత్యధిక కేసులు లక్షణాలు కనబడనివే కావడంతో జూన్ 1 నుంచి రైళ్లు తెరుస్తుంటే... కేసులు ఎలా పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి. మూడురోజులుగా దేశంలో కేసులు రోజుకు 5 వేలు పైగానే నమోదవుతున్న నేపథ్యంలో ఇది ఇంకెంత శృతి మించుతుందో అని జనం భయపడి చస్తున్నారు.

కరోనాకు భయపడితే 130 కోట్లమంది డబ్బు కష్టాలతో చచ్చేలా ఉన్నాం అని నిర్ణయించుకున్న కేంద్రం కేసులతో సంబంధం లేకుండా దేశాన్ని తెరవడానికే సుముఖత చూపింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆగిపోయిన ప్రజా రవాణాను మెల్లగా పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బస్సులు పున:ప్రారంభం కాగా.. ఇక రైళ్లను కూడా ప్రారంభించనుంది.  ప్రస్తుతం నడుపుతున్న శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్లతో పాటు రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లనూ నడపడానికి రైల్వే శాఖ రెడీ అయ్యింది. జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు పున:ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 

200 నాన్ ఏసీ సెకండ్ క్లాస్ రైళ్లను తొలి దశలో మొదలుపెడతారు. వాస్తవానికి 100 జతల రైళ్లు. అటు నుంచి ఒకటి, ఇటునుంచి ఒకటి అన్నట్లు.  ప్రయాణికులు ఈ రైళ్ల టికెట్లను ఆన్ లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అందరికీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

త్వరలో ప్యాసింజర్ రైళ్ల  టైం టేబుల్ కూడా విడుదల చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే కౌంటర్ల దగ్గర టిక్కెట్లు అమ్మరు. ఇక స్పెషల్ ట్రైన్లకు ఉన్నట్లే వీటికి కూడా షరతులుంటాయి. దశల వారీగా రైళ్ల సంఖ్యను పెంచి కొన్ని నెలల్లో రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.