వైసీపీ ఇలా అడ్డంగా దొరికిపోయింది

August 07, 2020

ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ పట్టిసీమను పూర్తిగా వ్యతిరేకించింది. దానివల్ల ఉపయోగం లేదని, అది డబ్బు వృథా ప్రాజెక్టు అని ఆరోపించింది. అంతేకాదు... పోలవరం కడుతున్నపుడు పట్టిసీమ వంద శాతం వృథా అని పేర్కొంది.

చంద్రబాబు పలుమార్లు దీనిపై స్పందించారు. నీకు అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ అడుగు జగన్ చెబుతాను. పట్టి సీమత రాయలసీమకు నీళ్లు తెచ్చే అవకాశం కలుగుతుంది. మీ ఊరికి కూడా నీళ్లు ఇస్తా అని చంద్రబాబు చెప్పారు.

కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైసీపీ పార్టీ గెలిచింది. పోలవరం ఖర్చు తగ్గించామని చెబుతున్నారు గాని పనులే ప్రారంభం కాలేదు. గతంలో కొనసాగిన స్పీడుతో కొనసాగించి ఉంటే ఈపాటికి పూర్తయ్యేవి.

అదే సమయంలో రివర్స్ టెండరింగ్ అని అంచనాలు తగ్గించి పొదుపు చేశారట. కానీ ఏడాది ఆలస్యం వల్ల జరిగిన నష్టం అంతకంటే పెద్దదు. అది పక్కన పెడితే అపుడు పట్టిసీమ మీద వైకాపా చేసిన ఆరోపణలు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. 

ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఇపుడు తెలుగుదేశం శ్రేణులు విమర్శలుగా చేసుకున్నాయి. తాజాగా పట్టి సీమ నీటిని కృష్నా డెల్టాకు విడుదల చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు 1050 క్యూసెక్కుల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణ నదిలోకి విడుదల చేశారు.

ఇపుడు కృష్ణా డెల్టా రైతులను కాపాడుతున్నది ఈ పట్టిసీమే. ఎందుకంటే వర్షాలు సరైన సమయానికి పడక.. ప్రకాశం బ్యారేజీ నీరు సమయానికి అందక ఖరీఫ్ పంటలు ఆలస్యంగా సాగు చేసే వారు. పట్టిసీమ పుణ్యమా అని సరైన సమయానికి మాగాణికి నీరందుతోంది. దీంతో రైతులు పట్టిసీమ కట్టాక ఎంతో ఖుషీ అయ్యారు. 

పట్టి సీమ ఉట్టి సీమ, డబ్బు వృథా అని విమర్శించిన వైకాపా దానిని ఇపుడు వరంలా భావిస్తోంది. చక్కగా వినియోగించుకుంటోంది. దూరదృష్టితో పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ.