వాళ్ల మాట విని పవన్ నష్టపోయారట

April 06, 2020

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంపై పునరాలోచనలో పడ్డారు. గత ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, వాస్తవానికి రెండు చోట్ల పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, కానీ పార్టీ నేతల సూచన మేరకే తాను పోటీ చేసినట్లు పవన్ వెల్లడించడం గమనార్హం. పవన్ మాటలను బట్టి ఆయన రిగ్రెట్ ఫీలవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది భీమవరం, గాజువాక నియోజకవర్గాలు కాకుండా సులువుగా గెలిచే తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తారట. దీనిని అధికారికంగా ధృవీకరించలేదు గాని ఆయన స్వయంగా మొగ్గు చూపారు. అంటే ఇక అక్కడి జనసేన పరివారం ఫుల్ ఖషీ చేసుకుంటోంది. రెండు కులాల మధ్య గొడవ రాష్ట్ర గొడవ అయిపోయింది, రాష్ట్రం నష్టపోతోంది. అందుకే బాధ్యతాయుత రాజకీయాల కోసమే పార్టీ పెట్టాల్సి వచ్చింది. దయచేసి నా వద్దకు మాత్రం ఎవరూ కులం చూసి రావొద్దు. నా సిద్ధాంతాలు నచ్చితే పార్టీలోకి రండి అని పిలుపునిచ్చారు పవన్.