​చంద్రబాబుకు అర్థం కానిది పవన్ కు వెలిగిందా?

July 11, 2020

తాను మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకోవడం కంటే ఇతరులను చెడ్డవారిగా చూపడం ద్వారా తాను మంచివాడు కావడమే అత్యంత సులువు అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏ వ్యూహంతో అయితే... చంద్రబాబును ట్రాప్ చేసి రాంగ్ రూట్లో నడిపించారో ఆ వ్యూహాన్ని చంద్రబాబు పసిగట్టలేదు. కానీ చంద్రబాబు ట్రాప్ లో పడి నష్టపోయా

 

న న్న విషయాన్ని పవన్ గ్రహించి... చాలా చాకచక్యంగా జగన్ ను ఎదుర్కొంటున్నారు. పవన్ టీం కూడా అతని అడుగు జాడల్లో ఉండటం ఇక్కడ గమనార్హం. 

జగన్ తనపై చేసిన వ్యక్తిగత కామెంట్లకు రిప్లయి ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టి... ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడానికి దానిని వాడుకోవడం ద్వారా పవన్ చాణక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డీ... నువ్వు నా గురించి  బూతులు మాట్లాడినా... నా తండ్రి నేర్పిన సంస్కారం నీ తప్పుల గురించి మాత్రమే మాట్లాడమంటోంది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీరు చేసిన చిల్లర వ్యాఖ్యలు చేయడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ అది మా ఉద్దేశం కాదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. నా పెళ్లిళ్ల గురించి నీకంత ఆసక్తి ఉంటే... నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో ఎవరు వద్దన్నారు అంటూ ఆ విషయాన్ని సింపుల్ గా ముగిస్తూ... ఇసుక సమస్యను, ఇంగ్లిష్ మీడియం సమస్యను ప్రధానంగా చర్చించారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, స్వయంగా బహిరంగంగా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. జనసేన మిమ్మల్ని ఇసుకపై, ఇతర పాలసీలపై ప్రశ్నిస్తుంటే... మీరు సమస్యను పక్కదారి పట్టించి క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేయడానికి నాపై వ్యక్తిగత దూషణ దాడికి దిగుతున్నారు.
మీరు తిడితే తెలుగుదేశం నాయకులు ఊరుకుంటారేమో, నేను ఊరుకోను. జనసేన ఊరుకోదు. మీకు పనికొచ్చే సలహాలు ఇస్తాం. ఈరోజు 18 విలువైన సలహాలను గవర్నర్ కు అందజేశారు. తప్పులు సరిద్దిద్దుకోండి. మీ ట్రాప్ లో మేము పడము. మీ పులివెందుల స్టైల్ పరిపాలన ఇక్కడ సాగదు అంటూ పవన్ హెచ్చరించారు. మీరు ఒకటి గమనించండి. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే భాష ఆధారంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం. తమిళనాడు భాషాభిమానానికి పేరు గాంచింది. అక్కడ ఇంకా తెలుగు మీడియం కూడా ఉందనే విషయం మీకు తెలుసా? అంతర్జాతీయ నివేదికలు చెప్పే విషయాన్నే గవర్నమెంట్లు ప్రాతిపదికగా భావిస్తాయి. ప్రైవేటు స్కూళ్లు ఆంగ్లంలో చెబితే... అది తప్పు అయితే మీరు కూడా అదే తప్పు చేస్తారా? అంతర్జాతీయ పరిశోధనలు... పిల్లలు ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకుంటే త్వరగా ఎదుగుతారు అని కనుక్కున్నారు. ఇది మీకు తెలుసా? అని పవన్ ప్రశ్నించారు. ఇక్కడ పొరపాటు జరిగితే పిల్లలు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారనే విషయాన్ని అర్థం చేసుకోండి. వారికి జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు?  అని నిలదీశారు పవన్. ఇదంతా ఒకెత్తు అయితే... మేము మీ ట్రాప్ లో పడం, మీరు ఏ విమర్శలు చేసినా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు, పొరపాట్ల గురించి మాట్లాడుతాం అంటూ జనసేనాధిపతి వేసిన బుల్లెట్ మాత్రం బ్రహ్మాస్త్రమే. వైసీపీ ట్రాప్ ను  చాలా త్వరగా పసిగట్టిన పవన్... వారి మాటలనే మెట్లుగా వేసుకుంటూ రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ​మొత్తానికి పవన్ చంద్రబాబు కంటే  బలంగా రాజకీయ కుట్రలను ఎదుర్కొంటున్నారు అనొచ్చు. కాకపోేతే దీనిని స్పష్టంగా బల్లగుద్ది చెప్పాలంటే... ఇంకొన్ని ఉదాహరణలు కావాలి. ఇంకొంత కాలం గడవాలి.