’’వైసీపీ ప్రభుత్వాన్ని కూలుతుంది, రేపు ఢిల్లీ వెళ్తున్నా‘‘

February 23, 2020

భూములు ఇచ్చిన రైతులకు కనీసం న్యాయం చేయకుండా... అధికారాన్ని ఆటల మార్చి రైతులపై లాఠీ ఛార్జి చేసిన ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని, పంతం పట్టి కూలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను రౌడీలుగా మార్చి... ముసలివారిని, వికలాంగులను కూడా నిర్దాక్షిణ్యంగా లాఠీలతో కొట్టిన ఈ ప్రభుత్వం కొనసాగడం ప్రజలకు ఏ మాత్రం క్షేమం కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నానని, ఈ అరాచకాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పారు. 

ఈ సందర్భంగా రైతులను, దెబ్బలు తిన్నవారిని పరామర్శించిన పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యక్తిత్వమే ఫ్యాక్షనిజం నేపథ్యం కలిగినదని ఆరోపించారు పవన్. కేవలం తమకు అమరావతిలో భూములు లేనవ్న ఏకైక కారణంతో జగన్ అమరావతిని మార్చారని చెప్పిన పవన్ ఈరోజు అమరావతి ప్రజలను మోసం చేసిన జగన్ రేపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను కూడా మోసం చేస్తారని హెచ్చరించారు.  మాట మాట్లాడితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందటారు. దానిని విచారణ జరిపి ఆస్తి స్వాధీనం చేసుకునే హక్కు, తప్పులు చేసిన వారిని శిక్షించే హక్కు ప్రభుత్వానికి ఉంది కదా.  రాజధాని మార్చే శక్తి ఉన్న ప్రభుత్వానికి తప్పులు సరిదిద్దడ చాతనవుతా లేదా అని పవన్ నిలదీశారు.

నేను చెబుతున్నా... గుర్తుపెట్టుకోండి. రాజధాని అంటే ఆటగా చూస్తున్న ఈ వైసీపీ నాయకులకు భవిష్యత్తులో ఒక్క సీటు వస్తే అది గొప్పలా అనిపించాలి. మన తీర్పు అలా ఉండాలి. రాజధాని తరలింపు తాత్కాలికమే. అది ఎక్కడికి పోయినా తిరిగి ఇక్కడికే తీసుకువస్తాం. ఎవరు అడ్డుపడినా ఆంధ్రకు అమరావతే శాశ్వత రాజధాని అని పవన్ పేర్కొన్నారు. ఇరు పార్టీల తరఫున చెబుతున్నాను. రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అద్భుతాలు జరగుతాయని చెప్పను. కానీ మన బాధలు కచ్చితంగా కేంద్రానికి అర్థమయ్యేలా వివరిస్తాను. కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది. లేకపోతే ప్రజలే కూలుస్తారు అని పవన్ అన్నారు.  నిరంకుశత్వానిక ిఆయుష్షు తక్కువ అని పవన్ హెచ్చరించారు.