పవన్ భలే అడిగాడు... జగన్ కి మంటే ఇక 

August 03, 2020

కరోనా వ్యాప్తికి ఇపుడు ప్రజలు కారణం కావచ్చు. కానీ మొదట్లో నిర్లక్ష్యం చేసి అది ప్రజల్లోకి రాకుండా అరికట్టడంలో మాత్రం  ప్రభుత్వాలదే తప్పు. ప్రజారోగ్య వ్యవస్థ కరోనా వల్ల చిన్నాభిన్నమైపోయింది. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి అడగనే వద్దు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఏపీ ముఖ్యమంత్రికి ఒక కీలక డిమాండ్ పెట్టారు. 

ప్రజలంతా భయపడుతున్న కోవిడ్ కు ఏ మాత్రం జంకకుండా వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ కార్మికులు తమ విధులను నిర్విర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఎవరైనా కోవిడ్ తో చనిపోతే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే అదే ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటకే 200 మంది వైద్య సిబ్బంది, 600 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

పది మంది పోలీసులు ప్రభుత్వ విధుల్లో ఉంటూ మరణించారని... వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఎవరైనా కోవిడ్ బారిన పడి కోలుకున్నాక తర్వాత కాలంలో వేతనంతో కూడని సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలు కూడా పెద్ద మనసుతో ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. 

మాటంటే ఓటర్లకు గాలం వేయడానికి డబ్బు పథకాలు పెట్టిన ఏపీ సర్కారు తాము పెట్టిన పథకాలు ఓట్ల కోసం కాకుండా, మానవతా దృక్పథంతో కనుక పెట్టి ఉంటే కచ్చితంగా పవన్ డిమాండ్ ను కూడా సీరియస్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ప్రభుత్వ సాయం పొందడానికి ఎంత హక్కు ఉందో ప్రజలను రక్షిస్తున్న కరోనా వారియర్స్ కు కూడా అంతే హక్కుంది.

మొత్తానికి సరైన సమయంలో పవన్ చేసిన డిమాండ్ జగన్ గొంతులో వెలక్కాయలా మారిందని చెప్పాలి. ఎస్ అనలేడు, నో అనలేడు. నిజానికి ఉద్యోగం వద్దనుకుని వైద్యులు, ఇతర సిబ్బంది వెళ్లిపోతే పరిస్థితి ఏంటి? ఇపుడు కొత్త వారు కూడా వచ్చి చేరరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్ వారియర్స్ మృతిచెందితే కోటి పరిహారం ఇవ్వడంలో ఏం తప్పులేదు.