వెనక్కితగ్గిన పవన్! వివరణ ఇచ్చేశారు..

December 06, 2019

సమాజంలో అవినీతి రాజ్యమేలుతోందని, జనసేనానిగా ఆ అవినీతిని అంతం చేసేందుకే రాజకీయ బాట పట్టానని చెప్పిన పవన్.. తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నారు. ఆయనకు అంతగా తెలియని విషయాల జోలికి వెళ్లి విమర్శల పాలవుతున్నారు. అసలే ఏపీలో పోటాపోటీగా రాజకీయ వేడి రాజుకుంటుంటే పవన్ ఇలా త‌న పరువు తానే తీసుకోవడం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. సంబంధం లేని విష‌యాల్లో త‌ల దూర్చి విమర్శల పాలై చివరకు.. అది ఎక్కడో చదివానని పేర్కొనడం పవన్ కి అలవాటైపోయింది.

పాకిస్థాన్‌తో నెల‌కొన్న యుద్ధ‌వాతావ‌ర‌ణంపై తొంద‌ర‌పాటు వ్యాఖ్య‌లు చేసి.. అంత‌ర్జాతీయంగా త‌న ప‌రువు తానే తీసుకున్నారు పవన్. పాక్‌లో భారత్‌ వైమానిక దాడులు జరిపిన రోజునే (గతనెల 26న) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పవన్‌ ‘యుద్ధం’ గురించి ప్రస్తావించారు పవన్. అప్పుడు ఆయన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ల కిందటే చెప్పారు’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అయితే చివరకు ఆ వ్యాఖ్యలపై తానే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

‘‘యుద్ధం వస్తుందని నాకేం తెలుసు! రెండేళ్ల ముందే నేనెలా చెప్పలగలను? పాకిస్థాన్‌ వాళ్లు మాట్లాడుకునేది వింటానా ఏంటి? లేమ్యాన్‌ బ్రదర్స్‌ సంస్థ ఆర్థికంగా కుప్పకూలుతుందని ముందునుంచే అంచనావేసి చెప్పేవారు. అలాగే యుద్ధం వస్తుందని ఊహించేందుకు కొందరి వ్యాఖ్యలే కారణం. నేనూ వాటిని దృష్టిలో ఉంచుకుని చెప్పాను’’ అని పవన్‌ వివరణ ఇచ్చారు. దీంతో ఇలా అధారాలు లేకుండా వ్యాఖ్య‌లు చేయడమెందుకు? పరువు తీసుకోవడమెందుకు? అని పవన్ గురించి జనంలో చర్చలు నడుస్తున్నాయి. మాట మార్చ‌డం త‌న త‌ప్పేమీ లేద‌న్న‌ట్లు త‌ప్పుకోవ‌డం ప‌వ‌న్‌కు ప‌రిపాటిగా మారింద‌ని కొందరు ఆయనపై వెటకారంగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు ఇలా పరువు తీసుకునే పనులు చేయడం జనసేన కు ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు విశ్లేషకులు.