పవన్ రేంజ్ గురించి ఆర్మీ చెబితే ఎలా ఉంటుంది?

August 11, 2020

 జనసేన అధినేత పవన్ కు ఈరోజు మరపురాని రోజు అని చెప్పాలి.  గతంలో తాను ప్రకటించిన కోటి రూపాయల చెక్కుతో ప్రస్తుతం వవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి  వారికి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ''ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా సైనికులకు ఏద‌న్నా సాయం చేయాల‌ని అనుకున్నానని, గ‌తంలో ఢిల్లీ వ‌చ్చిన‌పుడు కుద‌ర‌లేదు కాబ‌ట్టి ఇప్పుడు విరాళం ఇచ్చాన‌ని ప‌వ‌న్ ఆర్మీ అధికారులతో చెప్పారు.

అయితే పవన్ ఆరోజు తాను సాయం ప్రకటించి ఊరుకోలేదు. జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించాలని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. దాని రేంజ్ అంటే, ఆ పిలుపు పవర్ ఏంటో... ఈరోజు పవన్ కళ్యాణ్ ఆర్మీ అధికారుల నోట విని చాలా సంతోషపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సైనికాధికారులు ప్ర‌శంస‌లు కురిపిస్తూ.... `` సైనికుల‌కు అండ‌గా నిలిచేందుకు మీరు ఇచ్చిన పిలుపున‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఏ ప్రచారం చేసినపుడు, ఎవరు ప్రచారం చేసినపుడు రానంత డబ్బు, ప్రచారం మీ పిలుపు ద్వారా మా బోర్డ్ కు వచ్చింది. పెద్ద సంఖ్యలో విరాళాలు అందాయి. మీరు చేసిన ప్ర‌చారం వెల‌క‌ట్ట‌లేనిది. మీ వీడియో కనీవినీ ఎరుగని స్పందన తెచ్చింది. సైనిక కుటుంబాలకు సహాయపడటానికి దాదాపు 10 లక్షల మంది ముందుకు వ‌చ్చారు. ఇంత స్పందన ఆర్మీ బోర్డు చరిత్రలో మరెన్నడూ లేదు‘‘ అంటూ వారు పవన్ కు వివరించారు. 

తనకున్న విలువ ఏంటో పవన్ కు తెలిసినా తాను ఎవరో తెలియని వారు తన గురించి అంత గొప్పగా చెబుతుంటే... అది పవన్ ను సంతోషానికి గురిచేసింది. ఆర్మీ అధికారులు పొగడటం గురించి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ముచ్చటపడుతూ అదీ మా రేంజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.