పవన్.. రేర్ పీస్.. తాజా నిర్ణయం తెలిస్తే ఎందుకో అర్థమవుతుంది

July 02, 2020

ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలా ఆలోచించటం అందరికి చేత కాదు. బ్యాంకు బ్యాలన్స్ మస్తు ఉన్నోళ్లు సైతం వాటిని బయటకు తీసి నాలుగు రూపాయిలు ఖర్చు పెట్టేందుకు కిందామీదా ఆలోచించే ఇవాల్టి రోజుల్లో అంతంత మాత్రంగా ఉండే ఆర్థిక పరిస్థితి. డబ్బులు లేవు. అందుకే.. సినిమాలు చేయనని చెప్పి కూడా సినిమాలు చేస్తున్నా అంటూ ఓపెన్ గా చెప్పేసే తీరు ఎంతమందికి ఉంటుంది?
జేబులో వంద ఉంటే.. లక్ష ఉన్నట్లు బిల్డప్ ఇచ్చే రోజుల్లో.. అందుకు భిన్నంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం.. చేతిలో డబ్బులు పెద్దగా లేకున్నా.. సాయం కావాలి సామి అన్నట్లు చేతులు జాస్తే.. వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుంది.  
ఇదంతా ఎందుకంటే ప్రజలంటే పిచ్చి. తన చుట్టూ ఉన్న వాళ్లకు అవసరం వస్తే.. తాను చూస్తూ ఊరికే ఉండలేనితనం మిగిలిన వారితో పోలిస్తే.. పవన్ ను ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బందులకు గురి చేసేలా చేసేది. పవన్ ను ప్యాకేజీ స్టార్ గా తెర మీదకు వచ్చిన తప్పు పట్టే వారు సైతం.. తెర వెనుక మాత్రం.. రాజకీయాల్లో ఇలాంటివి తప్పవు. పవన్ అలాంటోడు కాదు.. తప్పకే అలా చెప్పామని చెప్పే రాజకీయనాయకులు పలువురు మీడియా ప్రతినిధులకు తెలుసు.
తనకున్న స్తోమతకు మించి సాయం చేసే గుణం.. సినీ నటుల్లో.. సెలబ్రిటీల్లో.. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఉంటుందా? అంటే.. నో అనే మాటే వస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన జనసేన అధినేత కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన విలక్షణతను అందరికి తెలిసేలా చేశారు. ఆ మాటకు వస్తే..తనను ఏదో పొగుడుతారని.. తనకేదో పొలిటికల్ మైలేజీ వస్తుందన్న ఆలోచన కంటే కూడా.. తన చుట్టూ ఉన్న వారికి తానేం చేయగలనన్న ఆలోచనకు ప్రతిరూపంగా పవన్ కల్యాణ్ తాజా ప్రకటన ఉందని చెప్పాలి.
కరోనా పిశాచి విరుచుకుపడుతున్న వేళ.. ప్రభుత్వాలకు ఆర్థిక దన్ను చాలా అవసరం. అలాంటి పరిస్థితిని అర్థం చేసుకొని.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు (మొత్తం కోటి) చొప్పున విరాళాన్ని ప్రకటించారు పవన్ కల్యాణ్. అంతేకాదు... పీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో కోటి రూపాయలు విరాళం ఇవ్వనున్నారు. దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. వాటిల్లో ఏ పార్టీ కానీ.. ఏ పార్టీ అధినేత కానీ తాము అధికారంలో లేని వేళ.. ప్రజల కోసం ప్రభుత్వానికి అండగా ఇంత మొత్తాన్ని విరాళంగా ఇస్తామన్న మాట ఎక్కడా వినిపించదు. అలాంటి వాటికి భిన్నంగా.. రాజకీయాల్ని పక్కన పెట్టేసి.. తనకు తోచినంత (చేతనైనంత) సాయాన్ని (రూ.పది.. ఇరవై లక్షలు కాకుండా) ప్రకటించటం లాంటివి పవన్ కు మాత్రమే సాధ్యం. అందుకేనేమో.. ఆయన అభిమానులే కాదు.. ఆయన్ను వ్యతిరేకించేవారు.. కొన్ని సందర్భాల్లో పవన్ ను రేర్ పీస్ గా అభివర్ణిస్తారు. అందుకు తగ్గట్లే ఆయన నిర్ణయాలు ఉన్నాయని చెప్పాలి. పవన్ తన ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు  చేయగా.. ఇప్పుడది వైరల్ గా మారింది. దేశ రాజకీయ నాయకుల్లో ఇదే అతిపెద్ద విరాళంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ప్రకటించిన సమాచారం మేరకు.