అత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌వ‌న్‌....అందుకే....?

July 01, 2020

ఎన్నిక‌ల వేడి తారాస్థాయికి చేరింది. ఏపీలో ప్ర‌ధాన పార్టీ నేత‌లు ప్ర‌సంగంలో ప్ర‌త్య‌ర్ధుల‌పై విరుచుప‌డుతున్నారు. సెంటిమెంట్ ర‌గ‌ల్చ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్ధుల వ్య‌క్తిగ‌త జీవితాల‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో రాజ‌కీయాలు హాట్‌హాట్ మారాయి. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ముందు రాష్ట్రంలోప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడిపై విరుచుప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా రాష్ట్రం సంక్షోభానికి గురైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాని తీరా ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్ది ప‌వ‌న్ త‌న రూటు మార్చాడు. చంద్ర‌బాబు పై ఉన్న ఆగ్ర‌హాన్ని జ‌గ‌న్ పై చూపించ‌డం మొద‌లు పెట్టాడు. ఒక్క సారి ప‌వ‌న్ గొంతు మార‌డంపై అనేక ర‌కాల క‌థ‌నాలువినిస్తున్నాయి. ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌హ‌క‌రిస్తున్నాడ‌ని కొంత మంది రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే విమ‌ర్శిస్తున్నాడ‌ని మ‌రి కొంత మంది చ‌ర్చించుకుంటున్నారు. కాని హ‌ఠాత్తుగా ప‌వ‌న్ వ్యూహాన్ని మార్చి జ‌గ‌న్ పై విరుచుప‌డ‌టానికి విశ్లేష‌కులు మ‌రో కార‌ణాన్ని కూడా చెబుతున్నారు. 

బిజెపి, జగన్‌, పవన్‌ కలిసిపోతున్నారంటూ చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులంతా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురూ ఒకటే అని ఊరూవాడా చెబుతున్నారు. వాస్తవంగా వపన్‌ కల్యాణ్‌ వామపక్షాలతో కలిసి పని చేస్తున్నారు. అయినా తెలుగుదేశం వ్యూహాత్మకంగా పవన్‌ను దెబ్బకొట్టడం కోసం… ఆయన్ను బిజెపి, వైసిపిలతో కలిపి చూపిస్తోంది. ఇదే సమయంలో టిడిపితో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా పవన్‌న్‌పై దాడి చేస్తోంది. వైసిపి, జనసేనలను బిజెపి తెరవెనుక నుంచి నడిపిస్తోందని, ఎన్నికల సమయంలో జగన్‌, పవన్‌ పొత్తు పెట్టుకుంటారని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌, టిడిపి చేస్తున్న ప్రచారం జగన్‌ కంటే పవన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అందుకే తనకు బిజెపి, వైసిపిలతో ఎటువంటి సంబంధమూ లేదన్న స్పష్టత ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ వైసిపిపైన విమర్శలు తీవ్రం చేశారు. కాక‌లు తీరిన పార్టీల పొలిటిక‌ల్ గేమ్‌లో ప‌వ‌న్ చిక్కుకుపోయాడ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. తాను ఏ పార్టీకి స‌హ‌క‌రించ‌డం లేద‌ని స్వ‌తంత్రంగా పోటీ చేస్తున్న విష‌యాన్ని జ‌నాల‌కు చెప్పేందుకు ప‌వ‌న్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. మ‌రి ఓట‌ర్లు ప‌వ‌న్ మాట‌ను న‌మ్ముతారా లేదా అనేది ఓటింగ్ పూర్త‌యితే గాని చెప్ప‌లేం.