జ‌గ‌న్ గాలి తీసేసిన ప‌వ‌న్

June 02, 2020

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న చ‌ర్య‌ల‌తో మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గాలి తీసేశాడు. ఇంత‌కుముందు సుగాలి ప్రీతి అంశంలో ప‌వ‌న్ పోరాట ఫ‌లితంగా ఆ కేసును సీబీఐకి అప్ప‌గించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొని జ‌గ‌న్ ఇమేజ్ దెబ్బ తింది. ఇప్పుడు క‌రోనా వైర‌స్ మీద పోరాటంలో జ‌గ‌న్ ఎంత‌గా వెనుక‌బ‌డి ఉన్నాడో.. ఈ వైర‌స్ ప‌ట్ల ఆయ‌న చేసిన సిల్లీ కామెంట్లు ఎంతగా విమ‌ర్శ‌ల పాల‌య్యాయో తెలిసిందే. ఇది చాల‌ద‌న్న‌ట్లు ప‌వ‌న్.. ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా చేప‌ట్టాల్సిన ప‌నిని తాను చేసి.. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడు నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుని జ‌గ‌న్ స‌ర్కారుకు చిక్కులు తెచ్చిపెట్టాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొలగండి గ్రామం నుంచి చేపల వేట కోసం తమిళనాడు తీరానికి వెళ్లిన 30 మంది మత్స్యకారులు లాక్ డౌన్ వల్ల చెన్నై హార్బర్లో చిక్కుకుపోయారని.. వసతి, భోజనం లేక వాళ్లంతా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని.. వారికి తగిన సదుపాయాలు కల్పించి సంరక్షించాల్సిందిగా సోమ‌వారం ఉద‌యం తమిళనాడు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాడు. దీనిపై త‌మిళనాడు ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న స్పందించింది. వెంట‌నే బాధితుల్ని అక్క‌డి అధికారులు క‌లిశారు. వారికి భోజ‌న ఏర్పాట్లు చేశారు. అలాగే స్వ‌స్థ‌లాల‌కు పంపే ప్ర‌య‌త్న‌మూ మొద‌లైంది. దీనిపై నేరుగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రే స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ తాము బాధితుల్ని ఆదుకున్ను వైనాన్ని వివ‌రించారు. ప‌వ‌న్ మాట‌తో బాధితుల‌కు స‌త్వ‌ర సాయం అంద‌డంతో ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సిన ఏపీ స‌ర్కారు అస‌లేమీ ప‌ట్ట‌నట్లు ఉండిపోవ‌డం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.