చంద్రబాబు కు ఫోన్ చేసిన పవన్ 

February 23, 2020
CTYPE html>
ఐదు నెలలుగా ఇసుకతో లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం దిగిరాకపోయే సరికి... ప్రత్యక్ష నిరసనలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది.
పవన్ కళ్యాణ్ దీనిపై విశాఖలో నవంబరు 3న ఏకంగా లాంగ్ మార్చ్ అంటూ ఓ పెద్ద కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయినా ఇంకా ఇసుక అందుబాటులోకి రాలేదు. దీంతో జనసేన పార్టీ తలపెట్టిన ఇసుక నిరసన కార్యక్రమం లాంగ్ మార్చ్ కు మద్దతు ఇవ్వమని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు.  ఈ సందర్భంగా సంబంధిత అంశాలపై వారిద్దరు చర్చించుకున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యలు, ఇసుక అక్రమ రవాణా అంశాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే వేరుగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం లాంగ్ మార్చ్ కు మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు జేఎస్పీ శ్రేణులు తెలిపాయి. 
ఇది లా ఉండగా... బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు కూడా అంతకుముందే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి బీజేపీ మద్దతు కోరారు. వారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా... ఇసుక కొరత ఈ స్థాయిలో రావడం చరిత్రలోనే ప్రథమం. అందుకే అన్ని పక్షాలు ఏకమై ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగాయి.