జగన్ ప్రభుత్వం కూలిపోతుంది... పవన్ సంచలనం

February 22, 2020

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చిన జగన్ సర్కారు ఇపుడు రైతుల జీవితాలపై పగబట్టిందన్నారు. ఇంత మంది జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని పవన్ వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై, వారి గిట్టుబాటు ధరలపై, ఏపీ సర్కారు వ్యవసాయ విధానంపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చాటడానికి పవన్ ఏర్పాటుచేసిన మెరుపు ఉద్యమంగా జనసేన రైతు సౌభాగ్య దీక్షను వ్యాఖ్యానిస్తున్నారు. 

డిసెంబరు 12 గురువారం కాకినాడలో నిర్వహించిన ఈ నిరసన సభకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ప్రతి శని, ఆదివారాలు సెలవు తీసుకునే రైతులు... నిర్విరామంగా పనిచేసే రైతులపై పగబట్టారని... రైతుల కష్టం రాష్ట్రానికి అరిష్టం అని... ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. 

బలహీనుల తరఫున పోరాడితే కేసులతో వేధించడానికి తానేమీ సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు అని పరోక్షంగా విజయసాయిరెడ్డి, జగన్ లపై ఘాటు విమర్శలు చేశారు పవన్. నాకు సిమెంటు ఫ్యాక్టరీలు లేవు, నేను కాంట్రాక్టులు చేయను. మిమ్మల్ని వేటాడి అయినా అభాగ్యుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతాను అని పవన్ వ్యాఖ్యానించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం చేసే జనసేన పోరాడి సాధిస్తుందన్నారు.