ఢిల్లీకి పీకే... ఇంటరెస్టింగ్ గా టూర్ షెడ్యూల్

April 05, 2020
CTYPE html>
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడపనున్న పవన్... ఏఏ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు పవన్ ఢిల్లీకి వెళ్లినా... ఇప్పుడు వెళుతున్న సందర్భంగా పవన్ టూర్ షెడ్యూల్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గురువారం ఉదయమే ఢిల్లీకి చేరుకునే పవన్... ఇటీవల సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ప్రకటించిన రూ.1 కోటి విరాళాన్ని అందజేసేందుకు నేరుగా కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ సైనిక అధికారులకు రూ.1కోటి చెక్కును అందజేసిన తర్వాత పీకే ఢిల్లీ టూర్ మరింత ఆసక్తికరంగా మారనుంది. 
గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పవన్ తో పాటు బీజేపీ కీలక నేత,  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం పవన్ టూర్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే... స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్మ సింధియాలు ఇప్పటికే నేషనల్ లెవెల్ లో సత్తా కలిగిన నేతలుగా ఎదిగారు. అయితే రాజకీయాల్లో ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన పవన్... ఇంకా తన సత్తా ఏమిటన్నది నిరూపించుకోలేదు. ఈ నేపథ్యంలో సత్తా కలిగిన నేతలతో కలిసి సభా వేదికను పంచుకోవడంతో పాటుగా వారి సమక్షంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానాలిస్తుండటం నిజంగానే ఆసక్తి రేపుతోంది. మరి అత్యంత అరుదుగానే దొరికే ఈ అవకాశాన్ని పవన్ ఏ విధంగా వినియోగించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ టూర్ షెడ్యూల్ పై ఒక భారీ సెటైర్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ’’గెలిచినోడు ఈ శుక్రవారం కోర్టు బోనులో నిలబడుతుంటే... ఓడిన వాడు దేశ రాజధానిలో నాలుగు మంచి మాటలు చెప్పడానికి వెళ్తున్నాడు’’ అంటూ కొందరు జగన్ పై పరోక్ష విమర్శనాస్త్రాలు వేశారు.