జగన్ చేసిన పనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

August 10, 2020

కరోనా కాలంలో ఫాం హౌస్ లో నివసిస్తున్న జ‌న‌సేన పార్టీ (Janasena Party) అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan kalyan) మీడియా ముందుకు వచ్చారు. అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.   ఏపీ ప్ర‌భుత్వం తీరుపై కొన్ని విషయాల్లో  ఘాటు  వ్యాఖ్య‌లు చేశారు.  ముఖ్యంగా కరోనా, ఇళ్ల స్థలాలు, అమరావతి (Amaravati) అంశాలపై తన వెర్షను వినిపించారు

కరోనా (Corona) - ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనే విషయంలో కొన్నింటిలో తన సమర్థతను చూపించింది. కానీ ఈ జాగ్రత్త సరిపోదు. టెస్టుల వరకు బాగా చేశారు. కానీ చికిత్స విషయంలో విపలం అయ్యారు. వీలైనంత వేగంగా ఈ సమస్య ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి. అంత త్వరగా ఇది పోయే సమస్య కాదు. అది సుదీర్ఘ ప్రక్రియ. దానికి అనుగుణంగా సిద్ధం కావాలి.

ఇళ్ల స్థలాలు (Housing sites for poor) -  ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న ఇళ్ల స్థలాలను ఒక కుంభకోణంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ప్రపంచం ఇంతగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనలోనే లోపం ఉందని... పేదలకు గృహసదుపాయం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఉద్దేశాల్లో చాలా స్వార్థాలు కనిపిస్తున్నాయన్నారు. ఆరేడు లక్షల రూపాయల భూములను నాలుగైదు రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు. ఈ వ్యవహారంలో పార్టీ నేతలు మధ్యలోఉన్నారు. కోట్ల రూపాయలు వెనకేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో విచారించాను. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పనికిరాని భూములు ఎంచుకోవడం భారీ ధరకు ప్రభుత్వానికి అమ్మడం, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి వ్యాపారంలా చేశారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ పేదల ఇళ్ కల తీర్చడానికి ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఇంతవరకు లబ్ధిదారులకు కేటాయించకపోవడం కుట్ర అన్నారు. కట్టిన ఇళ్లు ఇవ్వమంటే...  ఇళ్లు కట్టింది త‌మ పార్టీ కాదని, మా పార్టీకి కాకుండా ఒకసారి, మ‌రో పార్టీకి ఓటు వేశార‌ని అందుకనే ఇవ్వం అని ఒకసారి వైసీపీ నేత‌లు పేర్కొంటూ అర్హుల‌కు ఇళ్లు ద‌క్క‌కుండా చేస్తున్న‌ర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు.

అమరావతి (Amaravati) - అమరావతి విషయంలో రైతులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఇపుడు వారి భూములు వారికి తిరిగి ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. రాజధాని పెట్టనంటే వారికి న్యాయం ఎలా జరిగేది? కచ్చితంగా వారికి న్యాయం జరగాలి. రైతుల పక్షాన బీజేపీ-జనసేనలు నిలబడతాయి. రైతులకు న్యాయం జరగకుంటే వదిలే పరిస్థితి లేదు. రాజధాని తరలింపు సొంత లాభం కోసమే గాని అభివృద్ధి కోసం కాదు, రాజధానులతో అభివృద్ధి వస్తుందని ప్రచారం చేయడం మోసం, బూటకం అన్నారు. 

పవన్ అభిప్రాయాలను కింది వీడియోలో విపులంగా వినొచ్చు.