హడావిడిగా హస్తిన వెళ్లిన పవన్....కీలక భేటీ?

June 02, 2020
CTYPE html>
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏం చేసినా సంచలనమే. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరచడం పవన్ నైజం. బీజేతో పొత్తుకు ముందు హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చిన పవన్ ....ఆ తర్వాత అంతే హడావిడిగా పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇపుడు సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్న పవన్ తాజాగా మరోసారి హడావిడిగా హస్తినకు పయనమయ్యారు. దీంతో, పవన్ ఏదో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి వైసీపీ అధినేత జగన్ ఒక రాజ్యసభ సీటు కేటాయించడంపై వస్తోన్న ఊహాగానాలపై చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ తరఫున బీజేపీ క్యాండిడేట్ రాజ్యసభ సీటు దక్కించుకుంటే....బీజేపీతో కటీఫ్ చెప్పే విషయం డిస్కస్ చేయడానికే పవన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకే పవన్ ఢిల్లీ వెళ్లారని జనసేన నేతలు చెబుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. 
 
ఏపీలో వైసీపీనీ ఢీకొడ‌దామ‌నే ఉద్దేశంతో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ బీజేపీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే,  ఏపీలో బీజేపీ, జ‌న‌సేన‌ల ప‌రిస్థితి మీకు మీరే..మాకు మేమే అన్న‌ట్లుంది. ఈ రెండు పార్టీల నేత‌ల మధ్య పెద్ద అండర్ స్టాండింగ్ లేదని తేటతెల్లమైంది. ఓ వైపు బీజేపీతో ముంద‌స్తు ష‌ర‌తుల ప్రకారమే పొత్తు పెట్టుకున్నట్లు ప‌వ‌న్ పరోక్షంగా చెబుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీతొ సీఎం జగన్ భేటీ కావడంతో ఎన్డీఏ కూటమిలోకి వైసీపీకి ఆహ్వానం అందిందన్న ఊహాగానాలు వచ్చాయి. ఎన్డీఏలో వైసీపీ చేరితే....తాను బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంటాన‌ని ప‌వ‌న్ ప‌రోక్షంగా చెప్పేశాడు. ఏపీ కోటాలో బీజేపీ తరఫున నత్వానీకి రాజ్య సభ సీటు ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా రికమెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్....బీజేపీని వీడడం ఖాయమని...బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు మార్చి 13న పవన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
 
ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఏపీ అసెంబ్లీలోని కమిటీ హాల్ లో మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏపీ కోటాలోని నాలుగు సీట్లలో ఒకటి బీజేపీ రికమెండ్ చేసిన క్యాండిడేట్ కు దక్కుతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మోడీ, షా, అంబానీల మాట జగన్ కాదనరని, కాబట్టి ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వక తప్పదని హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి జగన్ ఆ ఒక్క సీటు కేటాయిస్తారా లేదా అన్నది మార్చి 13న తేలనుంది. దీంతో, మార్చి 13వ తేదీన పవన్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు పవన్ దాదాపుగా ఫిక్స్ అయ్యారని...అందుకు మార్చి 13 డేట్ ఫిక్స్ కూడా చేశారని టాక్ వస్తోంది. 
 
మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని జగన్ ప్రకటించినా కూడా పవన్ నిమ్మకు నీరెత్తినట్లుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. అందులోనూ పొత్తు ధర్మం ప్రకారం సీట్ల పంపిణీ కార్యక్రమానికి చాలా టైం పడుతుంది.  నిజంగా బీజేపీతో అంతా సఖ్యంగానే ఉంటే....పొత్తులో భాగంగా ఎవరికెన్ని సీట్లని బీజేపీ నేతలతో సూత్రప్రాయ చర్చలైనా జరిపేవాడు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలతో నాకు సంబంధం లేదన్నట్లు పవన్ తన మానాన తాను షూటింగ్ లు చేసుకుంటూ సైలెంట్ అయ్యాడు. దీంతో, బీజేపీకి పవన్ గుడ్ బై చెప్పబోతున్నాడని బలంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీతో పవన్ తెగదెంపులు చేసుకుంటే....టీడీపీతో జనసేన బంధం మరోసారి బలపడుతుందని టాక్వే వస్తోంది. ఏ ఆప్ష‌న్ లేని....ప‌వ‌న్....టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి బాబుతో మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉన్న ప‌వ‌న్‌ కు....టీడీపీతో పొత్తుకు పెద్ద ఇబ్బందేమీ ఉండ‌ద‌నే టాక్ వస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు చిత్తవుతుందో లేదో తేలాంటే మార్చి 13వరకు వేచి చూడక తప్పదు.