ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పు ర‌హ‌స్యాలు బ‌య‌టికొచ్చాయి

September 17, 2019

జ‌న‌సేనాధిప‌తి... త‌ర‌చుగా చెప్పేమాట నాతో డ‌బ్బుల్లేవు అని. మేము డ‌బ్బు రాజ‌కీయాలు చేయ‌ము. జ‌నం కోసం మా పోరాటం... దానికి డ‌బ్బు అవ‌స‌రం అని నేను భావించ‌డం లేదు అని ఆయ‌న అంటూ ఉంటారు. అందుకే ఆయ‌న ఎపుడు ఎన్నిక‌ల అఫిడ‌విట్ దాఖలు చేస్తారా అని అంద‌రూ ఎదురుచూశారు. ఈరోజు ఆయ‌న నామినేష‌న్ వేశారు. అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.
భారీ అభిమానుల సందోహం మ‌ధ్య పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ వేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇందులో త‌న‌కు ఉన్న ఆస్తులు, అప్పులు, కేసులు వివ‌రించారు.
వాటి ప్ర‌కారం... దాదాపు 53 కోట్ల ఆస్తులున్నాయట‌. వాటిలో రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు. రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు.
డ‌బ్బుల్లేవు అంటాడు ఆస్తులు బాగానే ఉన్నాయ‌నుకుంటున్నారా... ఆయ‌న అప్పులు కూడా చూడండి. తనకు రూ.32.40 కోట్లకు పైగా బాకీలు ఉన్నాయని పవన్ వెల్ల‌డించారు. అయితే, ప‌వ‌న్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. ప‌వ‌న్ అప్పుల‌న్నీ ప్రైవేటు అప్పులే. అది కూడా త‌న‌కు తెలిసిన వారి వ‌ద్ద తీసుకున్నారు.
ఆయ‌న‌కు ఎవ‌రి వ‌ద్ద అప్పులు ఉన్నాయంటే..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - రూ.2.40 కోట్లు
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ - రూ. 1.25 కోట్లు
వదిన సురేఖ - రూ.1.07 కోట్లు
ఎం.ప్రవీణ్ కుమార్ (మేనేజ‌ర్‌) - రూ.3 కోట్లు
ఎంవీఆర్ఎస్ ప్రసాద్ - రూ.2 కోట్లు,
శ్రీ బాలాజీ సినీ మీడియా- రూ.2 కోట్లు,
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు - రూ.27.55 లక్షలు
వై.న‌వీన్‌కుమార్ - 5.5 కోట్లు

వీటితో పాటు ఆయ‌న అన్ని అప్పులు క‌లిపి 32.4 కోట్లు ఉన్నాయ‌ట‌. అంటే నిక‌రంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద అప్పుల‌న్ని తీర్చినా 20 కోట్ల ఆస్తి ఉంటుంది.