ఓటమికి 2 కారణాలు గుర్తించిన పవన్

July 04, 2020

ఎన్నికల ఫలితాలపై పవన్ చాలా ఆశలు పెట్టుకుంటున్నట్లు ఉన్నారు. సమీక్షలో ఆయన మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. చాలా మంచి ఫలితాలు సీట్లు ఆశించిన పవన్ చాలా నిరాశాజనకమైన ఫలితాలపై ఆరా తీశారు. లోపాలను గుర్తించే పనిలో పడ్డారు. జనసేన ఎంతో స్వచ్ఛమైన రాజకీయంతో ముందుకు వచ్చినా ఎందుకు ఇంత దారుణంగా విఫలమైందా అన్న దానికి పవన్ కళ్యాణ్ రెండు ప్రధాన కారణాలు గుర్తించారు.
ఆ రెండు కారణాలు
1. 2014లో పోటీ చేయకపోవడం
గత టెర్ము ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఈ ఎన్నికల నాటికి మన బలం, క్యాడర్ చాలా పెరిగేది. కాబట్టి అపుడు పోటీ చేయకపోవడంతో 2019కి పూర్తిగా బలపడలేకపోయాం.
2. డబ్బులు పంచకోవడం
ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు విపరీతంగా డబ్బులు పంచాయని, కొన్నినియోజకవర్గాల్లో అందరూ కలిసి 150 కోట్ల వరకు పంచారని, కానీ జనసేన ఒక్క రూపాయి పంచకుండా రాజకీయం చేసిందని అందుకే వెనుకపడ్డామని.. అయినా కూడా ఇదే మార్గంలో ముందుకెళ్దాం అన్నారు. ఎన్నికలు సక్రమ పద్ధతిలో జరగలేదని... సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ అభిప్రాయపడ్డారు. ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు చేశామన్న సంతృప్తి ఉందన్నారు.
జనసేన సిద్ధాంతాలు చాలామందిని ఆకర్షించాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువతీయువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని... అందుకే తమకు లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలతో డీలా పడకుండా ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగుదామని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. ఎన్నికల్లో వాళ్లు మన వెనుక నిలబడతారని అన్నారు.