పవన్ కళ్యాణ్ సంచలన ఇంటర్వ్యూ

August 12, 2020

జనసేన అధినేత పవన్ కళ్యాణ్...  తన తాజా ఇంటర్వ్యూలో జగన్ విధానాలపై నిప్పులు చెరిగారు. పలు విషయాల్లో ప్రభుత్వ అసమర్థతను, అవగాహనా రాహిత్యాన్ని ఎండగట్టారు.

జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు సృష్టించడంలో విఫలమవుతోందని... అందుకే అప్పులు తెచ్చి పాలన సాగిస్తోందని, ఇది నాయకుడి అసమర్థత అంటూ విమర్శించారు. 

దీనివల్ల ప్రభుత్వం నడిపే వ్యక్తులకు ఏం నష్టం ఉండదు, కానీ రాష్ట్రం తిరోగమనం వైపు నడుస్తుందన్నారు. 

ఇప్పటికైనా మించిపోలేదు... ఇంకా నాలుగేళ్లున్నాయి.  అభివృద్ధి పథం వైపు నడవండని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చింది వారిని ఉద్దరిస్తారని... కానీ ఏపీ సర్కారు అధినేత జగన్ రెడ్డికి ఓటు బ్యాంకు రాజకీయాలకే సమయం సరిపోవడం లేదన్నారు.

పార్టీ బలాన్ని నిత్యం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ధ్వజమెత్తారు.

మీ పనితనం కొన్ని వర్గాల తాత్కాలిక లాభాల కోసం పనిచేస్తుంది తప్ప... సమాజానికి ఉపయోగపడటం లేదన్నారు. 

పాలనలో తప్పటడుగులు ... కోర్టుల్లో ఎదురు దెబ్బలు వైసీపీ సర్కారుకు ఇట్లే గడిచిపోతుంది.

60 కేసుల్లో ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోకపోేత ఎలా? ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు సరిచేసుకోవాలని అన్నారు.

అనేక రకాల కార్పొరేషన్ ఫండ్లను మీ సొంత పథకాలకు మళ్లించి వారికి అన్యాయం చేస్తున్నారు. దీనిని వెంటనే మార్చుకోవాలని హెచ్చరించారు పవన్. 

మీరు కాపులకు రిజర్వేషను ఇవ్వను అన్నారు. అయినా మీకు ఓట్లేసి గెలిపించారు.

ఇంకోసారి స్పష్టత ఇవ్వండి. వారి నిర్ణయం వారు తీస్కుంటారు కదా అని పవన్ అన్నారు.

ఈ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయనే చెప్పాలి... ఇవ్వను అన్నాక ఓట్లేసి.. మళ్లీ ఆశించడం ఏంటో విచిత్రం, దానిని పవన్ ప్రస్తావించడం ఇంకా విచిత్రం.